Political News

అంగ‌బ‌ల‌మే కాదు… ఆర్థికంగానూ టీడీపీనే ఫ‌స్ట్‌!

రాజ‌కీయ పార్టీల‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల బలం అత్యంత ముఖ్యం. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. గెలుపునే కాదు.. పార్టీని కూడా ప్ర‌భావితం చేస్తుంది. అయితే.. ఈ రెండు విష‌యాల్లోనే కాదు.. ఆర్థికంగా కూడా తెలుగు దేశం పార్టీ బ‌లంగానే ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. పార్టీకి ఇటు ఆన్‌లైన్ వేదిక‌గా.. 10 ల‌క్ష‌ల మంది మైటీడీపీ యాప్‌లో న‌మోదు చేసుకున్నారు. మ‌రోవైపు.. ఆఫ్ లైన్‌లో 1.2 కోట్ల మంది స‌భ్య‌త్వాలు క‌లిగిఉన్నారు. అంటే.. టీడీపీకి అంగబ‌లం ఎలా ఉందో అర్థం అవుతుంది.

ఇక‌, కేవ‌లం అంగ‌బ‌ల‌మే కాకుండా.. అర్థ‌బ‌లంలోనూ టీడీపీ ముందుంది. ఈ ఏడాది పార్టీ ఆస్తులు, ఆదాయం, ఖ‌ర్చుల వివ‌రాల‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పార్టీ స‌మ‌ర్పించింది. దీనిలో అన్ని వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా వివ రించారు. పార్టీకి ఈ ఏడాది లెక్క‌ల ప్ర‌కారం 526 కోట్ల మేర‌కు ఆస్తులు(ధ‌న రూపంలో) ఉన్న‌ట్టు పేర్కొన్నారు. ఇవి.. పూర్తిగా అన్ని ఖ‌ర్చులు పోను.. మిగిలిన సొమ్ముగా పార్టీ వివ‌రించింది. ముఖ్యంగా పార్టీ కార్య‌క‌ర్త‌ల కోసం చేసిన బీమా ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇది 46.25 కోట్ల రూపాయ‌లుగా ఉంది.

అలానే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో అభ్య‌ర్థుల‌కు ఖ‌ర్చుల కింద‌17 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశారు. ఇలా.. మొత్తం అన్ని ఖ‌ర్చులు పోగా.. స్థిరంగా 526 కోట్ల‌రూపాయ‌ల మేర‌కు వివిధ బ్యాంకుల్లో న‌గ‌దు నిల్వ ఉంది. ఇవి కాకుండా.. స్థిరాస్తులు.. అంటే పార్టీ కార్యాల‌యాల విలువ మ‌రో 20 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని పేర్కొంది. అయితే.. ఇది ప్ర‌భుత్వ రెవెన్యూ విలువ ప్ర‌కారం వెల్ల‌డించారు. బ‌హిరంగ మార్కెట్‌లో మ‌రో 2 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని నాయ‌కులు చెబుతున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ ఆస్తులు 320 కోట్ల‌రూపాయ‌లు కాగా.. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీకి విరాళాల రూపంలో మ‌రో 200 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు స‌మ‌కూరించింది. రెండు సార్లు నిర్వ‌హించిన మ‌హానాడు, రెండు సార్లు నిర్వ‌హించిన స‌భ్య‌త్వం కార‌ణంగా ఈ నిధులు స‌మ‌కూరాయి. మొత్తంగా.. అటు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ప‌రంగానే కాకుండా.. ఇటు ఆర్థికంగా కూడా టీడీపీ ఉన్న‌త‌స్థాయిలో ఉండ‌డం గ‌మ‌నార్హం. 

This post was last modified on November 26, 2026 3:46 pm

Share

Recent Posts

చంద్రబాబు, జగన్ ఎప్పుడైనా కొట్టుకున్నారా?

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవలు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్నా…

22 minutes ago

“మీరు ఒంట‌రిగా ఉన్నారా?“… అయితే ఈ `మోసం` మీకోస‌మే!

సోష‌ల్ మీడియాను హ్యాండిల్ చేసే విష‌యంలో అప్ర‌మ‌త్త‌త అత్యంత ముఖ్యం. క‌నిపించిన ప్ర‌తి సందేశాన్నీ.. ఆక‌ట్టుకునే మాట‌ల‌తో ఆక‌ర్షించే అమ్మాయిల…

36 minutes ago

వినాశనాన్ని అడ్డుకునే ‘వృషకర్మ’ సంకల్పం

తండేల్ సూపర్ హిట్ తర్వాత నాగచైతన్యకి గ్యాప్ వచ్చేసింది. కారణం వృషకర్మ. ప్యాన్ ఇండియా బడ్జెట్ తో కెరీర్ లోనే…

3 hours ago

బంధాల మధ్య చిచ్చు పెడుతున్న భోజనాలు

భారతీయ పెళ్లిళ్లలో భోజనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు మంచి విందు ఏర్పాటు చేయడం కుటుంబాలు తమ…

3 hours ago

త‌ను వెళ్ల‌క‌పోగా… జ‌గ‌న్ త‌న‌వారీనీ అడ్డుకున్నారా?

ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ష‌ర్మిల, సువార్త‌ బోధ‌కుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్ దంప‌తుల కుమార్తె అంజ‌లి, సోమ‌ల ర‌ఘురామిరెడ్డిల…

3 hours ago

పెళ్లి వేడుకలో పిచ్చి సాహసం.. గుర్రపు పందేల కోసం..

వినోదం కోసం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం ప్రజల ప్రాణాల మీదకు తెస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? బీహార్‌లో జరిగిన…

5 hours ago