Movie News

సమ్మర్ హాలిడేస్‌కు వింటర్ పరీక్ష

కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న సినిమాలు నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందులోనూ ఇమేజ్ ఉన్న నటీనటులు కాకుండా చిన్న పిల్లలను మెయిన్ క్యాస్టింగ్ గా పెట్టినప్పుడు ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కానీ వాయిదాల పర్వంలో బాగా ఆలస్యమైన సమ్మర్ హాలిడేస్ రేపు థియేటర్లలో అడుగు పెట్టనుంది. 90 బయోపిక్ ఫేమ్ రోహన్, ఆంధ్రకింగ్ తాలూకా ఫేమ్ అరుణ్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ ఎంటర్ టైనర్ కి నిర్మాత ధీరజ్ మొగిలినేని అంతా తానై ప్రమోషన్లు చేసుకున్నారు.

కాకపోతే పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద ఎదురీత స్వాగతం చెప్పనుంది. రామాయణ పార్ట్ 1కి వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద నిలబడేలా ఉంది. అదే జరిగిన పక్షంలో సమ్మర్ హాలిడేసి టార్గెట్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ లో ఎక్కువ శాతం అటువైపు మొగ్గే ఛాన్స్ ఉంది. సూర్య సీన్ మీద క్రేజ్ క్షేత్ర స్థాయిలో బాగానే ఉంది. నయనతార మహాశక్తి మీద మహా అంచనాలు లేవు కానీ భారీ చిత్రమే కాబట్టి అంత తేలికగా తీసుకోవడానికి ఉండదు.

ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తుఫాన్ల నుంచి కొంత ఊరట దక్కినప్పటికీ ఆంధ్ర వైపు జన జీవనం ఇంకా కుదుటపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో క్రేజ్ ఉన్న సినిమాలకే థియేటర్ల దగ్గర జనం కనిపించడం కష్టం. ఇక చిన్న చిత్రాలు పబ్లిక్ ని ఆకట్టుకోవాలంటే ఏదో ఒక మేజిక్ అయితే చేయగలగాలి. సమ్మర్ హాలిడేస్ మీద టీమ్ ఆ నమ్మకమైతే చూపిస్తోంది. నిన్న అల్లు అరవింద్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు.

జయసుధ చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెన్త్ రోల్ చేయడం లాంటి ఆకర్షణలు ఇందులో చాలా ఉన్నాయి. ఒకటి రెండు పాటలు వైరలయ్యే స్తాయిలో ఛార్ట్ బస్టర్స్ అయ్యుంటే మరింత అటెన్షన్ వచ్చేది. అమ్మమ్మ ఇల్లు కన్నా కోచింగ్ సెంటర్ ఏముంటుందనే కాన్సెప్ట్ తో బాల్యాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనే పాయింట్ తో రూపొందుతున్న సమ్మర్ హాలిడేస్ లో ఎమోషన్లు బలంగానే జొప్పించారు. శ్రీకర్ నయన్ దర్శకత్వం వహించగా లిటిల్ హార్ట్స్ ఫేమ్ సింజిత్ సంగీతం సమకూర్చారు.

This post was last modified on November 5, 2026 4:05 pm

Share

Recent Posts

రోడ్డుపై పాడే సింగ‌ర్ కాంటాక్ట్ అడిగిన మ్యూజిక్ డైరెక్ట‌ర్

న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో రోడ్ల మీద ప్ర‌యాణం చేస్తుంటే.. ప‌క్క‌న మైక్ సెట్ పెట్టుకుని చ‌క్క‌గా పాట‌లు పాడుతూ అంధులు ద‌ర్శ‌న‌మివ్వ‌డం…

43 minutes ago

భీమ్స్ సింప్లిసిటీ.. ఈ బైక్ వెనుక కథేంటి!

మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక నార్మల్ హోండా…

2 hours ago

కుటుంబం చేసిన ఖరీదైన పొరపాటు

ఆదర్శ కుటుంబం రెండో వారంలో అడుగు పెట్టనుంది. వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నా ఇంత…

3 hours ago

విమానంలో వాష్‌రూమ్ కష్టాలు.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు!

విమాన ప్రయాణం అంటే చాలామందికి సౌకర్యవంతమైన అనుభవం. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు. ముఖ్యంగా ఎక్కువ…

4 hours ago

గాడ్జిల్లా గండం తప్పిపోయింది

ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని భాషల్లో తీసినా గాడ్జిల్లా మీద ప్రేక్షకుల అభిమానం చాలా స్పెషల్. మూడేళ్ళ క్రితం పెద్దగా అంచనాలు…

4 hours ago

జ‌గ‌న‌న్నా .. ఇది న్యాయ‌మా?

"జ‌గ‌న‌న్నా ఇది న్యాయ‌మా? న‌మ్మినోళ్లే మ‌మ్మ‌ల్ని ముంచేశారు. నిలువునా ఓడించారు. మాకు మాట మాత్రం కూడా సాయం చేయ లేదు.…

5 hours ago