ఆదర్శ కుటుంబం రెండో వారంలో అడుగు పెట్టనుంది. వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నా ఇంత త్వరగా బాక్సాఫీస్ వేడి చల్లారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాని డిజాస్టర్ కాలేదు. యునానిమస్ అనిపించుకోలేదు. ట్రోలింగ్ స్థాయిలో సోషల్ మీడియా దాడి జరగలేదు. అయినా సరే కలెక్షన్లు భారీగా లేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా అయ్యిందేమిటని తెగ ఫీలవుతున్నారు. ఇంతకీ పొరపాటు ఎక్కడ జరిగిందంటే.
ఫ్యాన్స్ తో పాటు అధిక శాతం వ్యక్తపరుస్తున్న అభిప్రాయం ఒకటే. పది రోజులకు పైగా సెలవులు వచ్చిన దసరా సీజన్ ని వదిలేయడం పెద్ద మూల్యం చెల్లించేలా చేసింది. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ ముందు చెప్పిన కమిట్ మెంట్ ప్రకారం ఆదర్శ కుటుంబం కనక అక్టోబర్ 9 లేదా ఆపై వారం వచ్చి ఉంటే వసూళ్ల లెక్కలు వేరే ఉండేవి. టాక్ మారేది కాదు కానీ అంకెలు బెటర్ గా కనిపించేవి. ఆ అవకాశాన్ని జైలర్ 2, రణబాలి బ్రహ్మాండంగా వాడుకుంటే గరివిడి లక్ష్మి కూడా కాసిన్ని డబ్బులు చేసుకుంది.
ఇంకో బ్లండర్ కూడా ఉంది. ఏపీలో పది రోజులు టికెట్ రేట్ల పెంపు తీసుకోవడం, అది కూడా మిడిల్ క్లాస్ జనాల జేబులు ఖాళీగా ఉండే నెలాఖరులో అమలు చేయడం పెద్ద దెబ్బ కొట్టింది. మల్టీప్లెక్స్ లో ఒక్క టికెట్ మీద 75 రూపాయల పెంపు చిన్న మాట కాదు. సింగల్ స్క్రీన్ లోనూ 50 వర్తింపజేశారు. అని చోట్ల కాదని నిర్మాతలు పైకి అంటారు కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే ఏబీసీ తేడా లేకుండా దాదాపు ప్రతి సెంటర్లో హైక్స్ వర్తించిన ధరలే ఉంటాయి. మాస్ ని దూరం చేసేది ఇలాంటి చర్యలే.
సంక్రాంతి టైంలో రేట్లు పోటీలు ఎక్కువ తక్కువ ఉన్నా మేనేజ్ చేయొచ్చేమో కానీ ఇలా దసరా లాంటి టైంలో రిస్కులు తీసుకుంటే మాత్రం ఇలాంటి ఆటుపోట్లు చూడాల్సి ఉంటుంది. చెప్పాలంటే హైక్స్ తీసుకోవడం వల్ల జైలర్ 2 కూడా ఎంతో కొంత నష్టపోయింది. ఎక్కువ రేట్లకు హక్కులు తీసుకోవడం వల్ల బ్రేక్ ఈవెన్ మరీ పెద్దదైపోయింది. లేదంటే ఇంకా ఎక్కువ శాతం ప్రేక్షకులు చూసేవాళ్ళు. ఇంకో వారం ఆగితే ఆదర్శ కుటుంబం ఏకె 47 ఫైనల్ స్టేటస్ గురించి క్లారిటీ వస్తుంది.
This post was last modified on November 5, 2026 1:55 pm
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక నార్మల్ హోండా…
విమాన ప్రయాణం అంటే చాలామందికి సౌకర్యవంతమైన అనుభవం. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా తప్పవు. ముఖ్యంగా ఎక్కువ…
ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని భాషల్లో తీసినా గాడ్జిల్లా మీద ప్రేక్షకుల అభిమానం చాలా స్పెషల్. మూడేళ్ళ క్రితం పెద్దగా అంచనాలు…
"జగనన్నా ఇది న్యాయమా? నమ్మినోళ్లే మమ్మల్ని ముంచేశారు. నిలువునా ఓడించారు. మాకు మాట మాత్రం కూడా సాయం చేయ లేదు.…
"వివాహం పదికాలాల పాటు నిలవాలన్నా.. కొత్తగా పెళ్లిళ్లు చేసుకునేవారు సంతోషంగా ఉండాలన్నా.. ఈ కోర్సులో చేరండి" అంటూ గోవాకు చెందిన…
'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టికి ఆ తర్వాత కెరీర్ మాత్రం ఆశించినంత రేంజ్ లో సాగడం…