Movie News

సీతారాముల మీద ఒత్తిడి పెరుగుతోందా

నవంబర్ వచ్చేసింది. నాలుగు వేల కోట్లతో తీసినట్టుగా చెప్పబడుతున్న రామాయణ సిరీస్ మొదటి భాగం పార్ట్ 1 అయిదో తేదీ విడుదల కానుంది. రెండు వారాల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం ద్వారా ఆడియన్స్ పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేసిన టీమ్ లాస్ ఏంజిల్స్ లో చాలా ముందుగా ప్రీమియర్లు వేయడం ద్వారా మిశ్రమ స్పందన దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఇండియా వైడ్ ఎలాంటి ఓపెనింగ్ వస్తుందనే దాని గురించి నిర్మాణ సంస్థతో పాటు ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

ఒకరకంగా చెప్పాలంటే రామాయణ బృందం మీద ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద గ్రాండియర్ కు క్షేత్ర స్థాయిలో ఉండాల్సిన భీభత్సమైన బజ్ ఈ సినిమాకు లేదు. కారణాలు లేకపోలేదు. ఇప్పటికే వందల సార్లు తెరమీద చూసిన కథ కావడంతో స్టోరీ పరంగా జనాల్లో ఎగ్జైట్ మెంట్ లేదు. ట్రైలర్ లో చూపించిన విఎఫ్ఎక్స్ బాగున్నప్పటికీ మరీ మతిపోయే స్థాయిలో లేకపోవడం కొంత మైనస్ అయ్యింది. సోషల్ మీడియాలో సాయిపల్లవిని టార్గెట్ చేసుకున్న వైనం కొంత ప్రభావం చూపిస్తోంది.

ఏపీ తెలంగాణలో ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలోనే షోలు ప్రారంభం కాబోతున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న బుక్ మై షో ట్రెండ్స్ గమనిస్తే ఇంత పెద్ద స్కేల్ ఉన్న మూవీకి అధిక శాతం థియేటర్లు హౌస్ ఫుల్ కి దగ్గరగా ఉండాలి. కానీ రామాయణకు అలా లేదు. టాక్ చూశాక ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైప్ సంగతి ఎలా ఉన్నా ఫస్ట్ డే గ్రాస్ విషయంలో దురంధర్ రివెంజ్ ని దాటవచ్చనే రీతిలో బయ్యర్లు లెక్కలు వేస్తున్నారు.

ముందు రోజు ప్రీమియర్లు వేయడం లాంటి సాహసాలు రామాయణ టీమ్ చేస్తున్నట్టు లేదు. ఇప్పటికే యుఎస్ లో వేయడం ద్వారా పొరపాటు చేశారని అభిమానులు వాపోతున్నారు. అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు త్వరగా వేసే షోలు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా తెస్తాయి. సుమారు వెయ్యి కోట్లకు పైగా థియేటర్ టార్గెట్ తో బరిలో దిగుతున్న రామాయణ పార్ట్ 1కు నితేశ్ తివారి దర్శకత్వం వహించగా యష్, రన్బీర్ కపూర్ పాత్రలు హైలైట్ గా ఉంటాయని షో చూసినవాళ్లు మాట.

This post was last modified on November 1, 2026 9:56 am

Share

Recent Posts

56 ఏళ్ల వ‌య‌సులో ముఖ్య‌మంత్రి ప్రేమ వివాహం

జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి.. ఒమ‌ర్ అబ్దుల్లా తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యసు 56 సంవ‌త్స‌రాలు. గ‌త…

18 minutes ago

`పెద్దిరెడ్డి` ఇక చేతులెత్తేస్తారా?

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి.. పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా జ‌రుగుతున్న ఎన్నికల్లో చేతులు ఎత్తేశారు. కార‌ణాలు…

22 minutes ago

సందీప్ వంగాని టార్గెట్ చేయడం రైటేనా

నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన…

50 minutes ago

ప్రయోగం చేయడమే ప్రభావితం చేసిందా

టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ ఏదైనా ఉందంటే వాటిలో మొదటిది స్లాషర్. అంటే మనుషులను కాయగూర…

52 minutes ago

లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం సీఎం సాబ్

తమిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌కు భారీ రాజ‌కీయ సెగ త‌గులుతోంది. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి క‌నీసం ఏడాది కూడా కాకుండానే..…

2 hours ago

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరింత వేగం

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ‌ను రోజువారీగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఆయా కేసుల…

2 hours ago