Movie News

ప్రయోగం చేయడమే ప్రభావితం చేసిందా

టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని జానర్ ఏదైనా ఉందంటే వాటిలో మొదటిది స్లాషర్. అంటే మనుషులను కాయగూర ముక్కల్లా నరికి చంపడమనే కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో లెక్కలేనన్ని సినిమాలొచ్చాయి కానీ మన దగ్గర తక్కువే. అందుకే విశ్వక్ సేన్ ఏరికోరి కల్ట్ కథను రాసుకున్నాడు. వరస డిజాస్టర్లతో విసుగు చెంది తనను తాను మళ్ళీ డైరెక్ట్ చేసుకుంటే తప్ప హిట్టు రాదనీ గుర్తించి మెగా ఫోన్ చేపట్టాడు. టాక్ సంగతి పక్కనపెడితే కల్ట్ ఓపెనింగ్స్ మాములుగా వచ్చాయని ట్రేడ్ టాక్.

సమస్య ఏంటంటే విడుదలకు ముందే విశ్వక్ చాలా స్పష్టంగా బలహీన మనస్కులు, పిల్లలు దూరంగా ఉండమని చెప్పేశాడు. సో ఆడియన్స్ లో మెజారిటీ శాతం థియేటర్లకు దూరంగా ఉండిపోయారు. మిగిలిన వాళ్లలో యూత్ వచ్చారు. ఫోటో షూట్ కోసం వచ్చిన తాకిడిని తట్టుకోలేక ఆ ప్రోగ్రాంనే క్యాన్సిల్ చేయాల్సి వచ్చిన విశ్వక్ సేన్ కు అంతే రద్దీ థియేటర్ల దగ్గర కనిపించకపోవడం ఒక కేస్ స్టడీ లాంటిది. నిన్న, మొన్న బుకింగ్స్ డీసెంట్ గా జరిగాయి తప్ప అదిరిపోయే రేంజ్ లో కాదు.

ఇప్పుడీ వీకెండ్ కనక కల్ట్ సరిగ్గా వాడుకుంటే రికవరీ ఛాన్సులు పెరుగుతాయి. ఆదర్శ కుటుంబం ఏకె 47కు ఎదురు పడటం మరీ అంత రిస్క్ కాకపోయినా కంటెంట్, స్టార్ ఇమేజ్, డైరెక్టర్ బ్రాండ్, బడ్జెట్ విషయాల్లో దాని డామినేషన్ ఉంటుంది కాబట్టి సహజంగా ఈ ప్రభావం బాక్సాఫీస్ వద్ద కనిపిస్తుంది. ఒకవేళ విశ్వక్ కనక కల్ట్ కాకుండా ఇంకేదైనా ఎంటర్ టైనర్ తో వచ్చి ఉంటే ఇంకాస్త మెరుగ్గా ఉండేది. అయినా అన్నిటికి సిద్ధపడే కల్ట్ తీశాడనేది తన మాటల్లో ముందే అర్థమైపోయింది.

ప్రాథమికంగా వచ్చిన టాక్ అలాగే ఉంటుందా లేక అనూహ్యమైన పికప్ ఏమైనా ఉంటుందా అనేది ఆదివారం అయ్యాక క్లారిటీ వస్తుంది కాబట్టి కల్ట్ గురించి ఇప్పుడప్పుడే ఎలాంటి స్టేట్ మెంట్స్ ఇవ్వలేం. వయొలెన్స్ మోతాదు బాగా దట్టించిన విశ్వక్ మరోసారి టెక్నికల్ గా తాను సాధిస్తున్న ఇంప్రూవ్ మెంట్ ఇందులో అయితే చూపించాడు. ఇది కాసేపు పక్కనపెడితే తక్కువ గ్యాప్ లోనే నవంబర్ 19 ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ తో పాటు డిసెంబర్ 3 లెగసితో విశ్వక్ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

This post was last modified on November 1, 2026 9:49 am

Share

Recent Posts

56 ఏళ్ల వ‌య‌సులో ముఖ్య‌మంత్రి ప్రేమ వివాహం

జ‌మ్ము క‌శ్మీర్ ముఖ్య‌మంత్రి.. ఒమ‌ర్ అబ్దుల్లా తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌యసు 56 సంవ‌త్స‌రాలు. గ‌త…

2 minutes ago

`పెద్దిరెడ్డి` ఇక చేతులెత్తేస్తారా?

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి.. పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తాజాగా జ‌రుగుతున్న ఎన్నికల్లో చేతులు ఎత్తేశారు. కార‌ణాలు…

5 minutes ago

సందీప్ వంగాని టార్గెట్ చేయడం రైటేనా

నిన్న అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థిని మీద ఒక యువకుడు రంపపు మెషీన్ తో దాడి చేసిన…

33 minutes ago

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మరింత వేగం

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల విచార‌ణ‌ను రోజువారీగా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన నేప‌థ్యంలో ఆయా కేసుల…

2 hours ago

ప్రకాష్‌రాజ్‌కు అడ్వాన్సులిచ్చి తీసేసుకున్నారట

ప్రకాష్ రాజ్ స్వతహాగా నటుడైనప్పటికీ.. కొన్నేళ్లుగా సినిమాల కంటే రాజకీయాల మీదే ఆయన దృష్టి ఎక్కువగా ఉంటోంది. 12 ఏళ్లుగా…

4 hours ago

రామాయ‌ణం.. ఒక్క స‌న్నివేశానికి ఆరున్న‌రేళ్లు

ఇప్పుడు ఇండియ‌న్ సినిమా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ది రామాయ‌ణం సినిమా కోస‌మే. 4 వేల కోట్ల బ‌డ్జెట్ అని…

5 hours ago