Movie News

చిట్టిబాబు బోణీ ఎలా జరిగింది

నిన్న విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 డీసెంట్ టాక్ తో మొదలై సాయంత్రం షోలకంతా మంచి పికప్ చూపించేసింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మల్టీప్లెక్సుల్లో దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ శుక్రవారం కొత్త రిలీజుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇదొక్కటే ఆప్షన్ గా మిగిలింది. మాస్ ని టార్గెట్ చేసిన విశ్వక్ సేన్ కల్ట్ మీద మిశ్రమ స్పందన వినిపిస్తున్న నేపథ్యంలో ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెంకటేష్ టీమ్ రెడీ అవుతోంది. నిన్న సక్సెస్ ప్రెస్ మీట్ కూడా చేశారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఆదర్శ కుటుంబం వరల్డ్ వైడ్ గ్రాస్ మొదటి రోజు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల మధ్యలో ఉందట. అధికారిక నెంబర్లు ఇంకా రాలేదు కానీ దానికి కొంచెం అటుఇటు ఉండొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సోలో హీరోగా వెంకటేష్ నటించిన మూవీకి ఇది బంపర్ ఓపెనింగ్ అని చెప్పలేం. ఎందుకంటే విపరీత వాయిదాలు, దసరా సెలవులు అయిపోయిన తర్వాత రిలీజ్ కావడం, రకరకాల పుకార్లు ప్రాజెక్టు హైప్ మీద ప్రభావం చూపించాయి.

ఇవాళ రేపు వీకెండ్ మొత్తం చిట్టిబాబు డామినేషన్ లోనే ఉంటుంది. అయిదో తేదీ నుంచి రామాయణ పార్ట్ 1 పోటీ ఉన్నప్పటికీ దాని గురించి తీవ్రంగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. తెలిసిన కథ కాబట్టి విజువల్ ఎఫెక్ట్స్ మీద అంచనాలున్నవాళ్ళే దానికి ఎక్కువగా వెళ్తారు. సోమవారం నుంచి ఆదర్శ కుటుంబం ఆక్యుపెన్సీలు డీసెంట్ గా ఉంటే మటుకు వెంకటేష్ ఖాతాలో మరో హిట్టు పడ్డట్టే. కేవలం ఒకటి రెండు రోజుల గ్రాస్ బట్టి ఫైనల్ స్టేటస్ ఎలా ఉండబోతోందో ఇప్పుడే అంచనాకు రాలేం.

సూర్య సీన్, నయనతార మహాశక్తి నవంబర్ ఆరు విడుదల కాబోతున్నాయి. వీటి ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనేది ముందే చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ మధ్య డబ్బింగ్ సినిమాలు అనూహ్య ఫలితాలు ఇస్తున్నాయి. వీరభద్రుడు, మండాడి దానికి మంచి ఉదాహరణ. టాక్సిక్ లాంటివి దారుణంగా పోవడం వేరే విషయం. ఇప్పుడు రాబోయేవి సర్ప్రైజ్ ఇస్తాయా షాక్ ఇస్తాయా వేచి చూడాలి. ఆదర్శ కుటుంబం ఏకె 47 యునానిమస్ టాక్ కనక తెచ్చుకుని ఉంటే లెక్కలు మరింత భారీగా ఉండేవి.

This post was last modified on October 31, 2026 12:53 pm

Share

Recent Posts

డ్రాగన్ మ్యూజిక్‌కి దురంధరుడు తోడైతే

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ విడుదలకు రెడీ అవుతున్న సంగతి…

17 minutes ago

ఆర్‌సీ 17… ఊహించని హీరోయిన్ ?

రేపు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కాబోతున్న రామ్ చరణ్ 17 తాలూకు డీటెయిల్స్ ఇప్పటిదాకా చాలా గుట్టుగా ఉంటూ…

2 hours ago

యలహంక నాదే… కానీ కూతురు పెళ్లి అక్కడ చెయ్యను

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తనయురాలు అంజిలి పెళ్లి యలహంక ప్యాలెస్ లో జరపవద్దని వైఎస్ జగన్ కరాఖండిగా తేల్చిచెప్పిన సంగతి…

2 hours ago

నాయుడుకు రెన్యువ‌ల్ ఉంటుందా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ పోస్టులో ఉన్న ప్ర‌ముఖ మీడియా అధిప‌తి బీఆర్ నాయుడు ప‌రిస్థితి సందిగ్ధంలో…

3 hours ago

మౌళిని కమర్షియల్ వింగ్‌లోకి లాగుతున్నారా

గత ఏడాది లిటిల్ హార్ట్స్ తో పరిచయమైన మౌళికి అంతకు ముందే సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ…

12 hours ago

ఇది నాకోసం కాదు – మన కోసం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి…

14 hours ago