Movie News

డ్రాగన్ మ్యూజిక్‌కి దురంధరుడు తోడైతే

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ విడుదలకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికైతే మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి వాయిదా లేదని చెబుతున్నారు కానీ ప్యాన్ ఇండియా సినిమాలు ఖచ్చితంగా మాట మీద ఉంటాయన్న నమ్మకం జనాల్లో ఎప్పుడో పోయింది. ఏళ్ళ తరబడి బాహుబలి నుంచి ప్యారడైజ్ దాకా జరిగిన పోస్ట్ పోన్ల వల్ల ఎవరైనా మాట మీద ఉంటారన్న గ్యారెంటీ లేదు. అయినా సరే డ్రాగన్ మటుకు సరైన ప్లానింగ్ తోనే ఉందట.

ఇదిలా ఉండగా డ్రాగన్ లోని కొన్ని పాటలు దురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్ దేవ్ తో కంపోజ్ చేయించే దిశగా నీల్ టీమ్ అడుగులు వేస్తోందని సమాచారం. ఈ మధ్య కాలంలో రవి బస్రూర్ సాంగ్స్ పరంగా అంత మంచి అవుట్ ఫుట్ ఇవ్వడం లేదు. బీజీఎమ్ ఓకే కానీ పాటల దగ్గర ఈయన బలహీనత బయట పడిపోతోంది. అందుకే శాశ్వత్ సహదేవ్ సహాయం తీసుకుంటారనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ఉంది. ఇది నిజమా కాదానేది అంత త్వరగా బయటపడకపోవచ్చు. ఇక్కడింకో ట్విస్టు ఉంది.

మైత్రినే నిర్మిస్తున్న రామ్ చరణ్ 17కి ముందు అనుకున్న సంగీత దర్శకుల్లో శాశ్వత్ సచ్ దేవ్ పేరు కూడా ఉంది. కానీ ఆ తర్వాత హఠాత్తుగా అనిరుధ్ రవిచందర్ పేరు తెరమీదకొచ్చింది. ఎవరిని ఫైనల్ చేస్తారో రేపు పూజా కార్యక్రమంలో ఏమైనా బయట పడుతుందేమో చూడాలి. ఒకవేళ శాశ్వత్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉంటే దాన్ని ఇప్పుడు డ్రాగన్ కోసం వాడుతున్నారేమోననే అనుమానం కొందరిలో లేకపోలేదు. క్లారిటీ వచ్చేందుకు ఇలాంటివి అఫీషియల్ గా చెప్పే ఛాన్స్ ఉండదు.

ఎవరైతేనేం కానీ డ్రాగన్ అయితే చెప్పిన డేట్ కి రావాలనేది అభిమానుల అభిమతం. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ యాక్షన్ గ్రాండియర్ రిలీజ్ విషయంలోనూ దురంధర్ ఫార్ములా పాటించేందుకు ట్రై చేస్తున్నారు. అంటే తక్కువ గ్యాప్ లో సీక్వెల్ కూడా వచ్చేలా ఒకే ఏడాదిలోనే రెండు తీసుకొస్తారన్న మాట. ప్రశాంత్ నీల్ తో సహా డ్రాగన్ టీమ్ ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాదు కాబట్టి అప్డేట్స్ కోసం కనీసం ఇంకో రెండు నెలలు ఎదురు చూడక తప్పదు.

This post was last modified on October 31, 2026 12:59 pm

Share

Recent Posts

చిట్టిబాబు బోణీ ఎలా జరిగింది

నిన్న విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47 డీసెంట్ టాక్ తో మొదలై సాయంత్రం షోలకంతా మంచి పికప్ చూపించేసింది.…

23 minutes ago

ఆర్‌సీ 17… ఊహించని హీరోయిన్ ?

రేపు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కాబోతున్న రామ్ చరణ్ 17 తాలూకు డీటెయిల్స్ ఇప్పటిదాకా చాలా గుట్టుగా ఉంటూ…

2 hours ago

యలహంక నాదే… కానీ కూతురు పెళ్లి అక్కడ చెయ్యను

ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తనయురాలు అంజిలి పెళ్లి యలహంక ప్యాలెస్ లో జరపవద్దని వైఎస్ జగన్ కరాఖండిగా తేల్చిచెప్పిన సంగతి…

2 hours ago

నాయుడుకు రెన్యువ‌ల్ ఉంటుందా?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ పోస్టులో ఉన్న ప్ర‌ముఖ మీడియా అధిప‌తి బీఆర్ నాయుడు ప‌రిస్థితి సందిగ్ధంలో…

3 hours ago

మౌళిని కమర్షియల్ వింగ్‌లోకి లాగుతున్నారా

గత ఏడాది లిటిల్ హార్ట్స్ తో పరిచయమైన మౌళికి అంతకు ముందే సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ…

12 hours ago

ఇది నాకోసం కాదు – మన కోసం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ పార్టీ శ్రేణులు, నాయ‌కుల‌ను ఉద్దేశించి…

14 hours ago