రేపు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభం కాబోతున్న రామ్ చరణ్ 17 తాలూకు డీటెయిల్స్ ఇప్పటిదాకా చాలా గుట్టుగా ఉంటూ వచ్చాయి. ముఖ్యంగా హీరోయిన్ గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. దురంధర్ ఫేమ్ సారా అర్జున్ అంటూ ఒకసారి, సయారా ఫేమ్ అనీత్ పడ్డా అంటూ మరోసారి ఇలా ఏవేవో పేర్లు తెరపైకి వచ్చాయి. పరిశీలన, ఫోటో షూట్లు జరగడం లాంటి వార్తల్లో ఎంతో కొంత నిజం ఉండొచ్చేమో కానీ చివరికి ఎవరూ ఊహించని పేరు ఇప్పుడు వినిపిస్తోంది. అదే సాత్విక వీరవల్లి.
దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తారతో డెబ్యూ చేస్తున్న సాత్విక వీరవల్లి స్వతహాగా ట్రెడిషనల్ డాన్సర్. భరతనాట్యంతో మొదలుపెట్టి ఆధునిక నృత్యం వరకు అన్నింటిలో ప్రవేశం ఉంది. అమెరికాలో పెరిగినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయి లక్షణాలు పుణికిపుచ్చుకున్న సాత్విక కుటుంబ మూలాలు చెన్నైలో ఉన్నాయి. చిన్నతనం నుంచే స్టేజి మీద ప్రదర్శనలు ఇచ్చింది. యుఎస్ లోని ప్రముఖ విద్యాలయం వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది.
నృత్యం, మోడలింగ్, సోషల్ మీడియా పాపులారిటీ ద్వారానే సాత్విక వీరవల్లి ఆకాశంలో ఒక తార అవకాశం దక్కించుకుంది. ఇది నిర్మాణంలో ఉండగానే బన్నీ వాస్ తర్వాత నిర్మించబోయే నాగచైతన్య మూవీలోనూ ఆమెనే లాక్ చేసుకున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ఇప్పుడు ఏకంగా రామ్ చరణ్ సరసన అంటే జాక్ పాట్ కొట్టినట్టే. అందులోనూ సుకుమార్ దర్శకత్వం అంటే చెప్పేదేముంది. పుష్పలో రష్మిక మందన్న, రంగస్థలంలో సమంత రేంజ్ లో అంచనాలు పెట్టుకోవచ్చు.
అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఇప్పటికైతే దీన్ని గాసిప్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ఆర్సి 17 వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు. 2028 రిలీజ్ టార్గెట్ గా పని చేయబోతున్నారు. సంగీత దర్శకుడు ఎవరనేది రేపు తెలిసే అవకాశం ఉంది. పెద్దికి అంత కష్టపడినా ఆశించినంత గొప్ప ఫలితం రాకపోవడం రామ్ చరణ్ ని నిరాశ పరిచి ఉంటుంది. ఈసారి సుకుమార్ తో చేయబోయేది అంచనాలకు మించి ఉండాల్సిందే. పుష్ప తర్వాత సినిమా కావడంతో ఆయన కూడా బెస్ట్ కన్నా తక్కువ ఇవ్వరు.
This post was last modified on October 31, 2026 11:25 am
ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తనయురాలు అంజిలి పెళ్లి యలహంక ప్యాలెస్ లో జరపవద్దని వైఎస్ జగన్ కరాఖండిగా తేల్చిచెప్పిన సంగతి…
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పోస్టులో ఉన్న ప్రముఖ మీడియా అధిపతి బీఆర్ నాయుడు పరిస్థితి సందిగ్ధంలో…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ తో పరిచయమైన మౌళికి అంతకు ముందే సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ…
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ పార్టీ శ్రేణులు, నాయకులను ఉద్దేశించి…
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందా? ఆయన ఆచూకీ కూడా కనిపించడం…
ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక రాజధాని అయిన విజయవాడలో ఇప్పుడు పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరింది. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవసం…