ఒకపక్క రజనీకాంత్ జైలర్ 2, ఇంకోవైపు ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. రెండూ మంచి బజ్ తెచ్చుకున్నాయి. బడ్జెట్, బిజినెస్ భారీగా చేసుకున్నాయి. చాలా సెంటర్స్ లో ఇవి తప్ప వేరే వేసేందుకు ఆప్షన్ లేనంతగా డిస్ట్రిబ్యూషన్ రేట్లు పలికాయి. అయినా సరే గరివిడి లక్ష్మిని వీటికి పోటీగా నిలపడం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేసిన చాలా పెద్ద రిస్క్. ఇంకా ఆలస్యం చేస్తే ప్రతివారం ఇదే సమస్య వస్తుందని భావించి దసరా సెలవుల అడ్వాంటేజ్ కోసం ధైర్యంగా ముందడుగు వేసింది.
ఉత్తరాంధ్ర వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. గరివిడి లక్ష్మి ఆ ప్రాంతానికి చెందిన సుప్రసిద్ధ కళాకారిణి కావడంతో అక్కడి జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్లలో పాటలకు జనాలు డాన్సు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కానీ మిగిలిన ప్రాంతాల్లో మటుకు కాస్త ఎదురీదుతున్న వైనం కనిపిస్తోంది. ముఖ్యంగా సీడెడ్, నైజామ్ లో నెమ్మదిగా వెళ్తోంది. మొదటి రోజు కన్నా పరిస్థితి మెరుగ్గా ఉంది కానీ ఇంకా బాగా పెరగాల్సిన అవసరం చాలానే ఉంది.
ఒకవేళ లక్ష్మికి ఇంకొంచెం సమయం దొరికి అక్టోబర్ 9 లేదా అక్టోబర్ 23 వచ్చి ఉంటే ఇంకోలా రెస్పాన్స్ ఉండేదని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. ఎందుకంటే సోలోగా వచ్చి ఉంటే దక్కే అడ్వాంటేజ్ వేరు. కామ్రేడ్ కళ్యాణ్ లాంటి వాటిని ఫేస్ చేయడం కొంత తేలిక. కానీ రజిని, విజయ్ అంటే సులభం కాదు. ఆదర్శ కుటుంబం హఠాత్తుగా డేట్లు మార్చుకోవడం వల్లే గరివిడి లక్ష్మి సైతం తేదీల పట్ల అయోమయం చెంది ఫైనల్ గా విజయదశమికి వచ్చిందని ఇన్ సైడ్ టాక్.
స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం కంటెంట్ మీద ఆధారపడిన గరివిడి లక్ష్మి లాంటి సినిమాలకు రిలీజ్ టైమింగ్ చాల కీలకం. పరిస్థితులను సరిగ్గా బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మిశ్రమ ఫలితాలు చూడాల్సి వస్తుంది. ఇదంతా ఎలా ఉన్నా రాజా సాబ్ రూపంలో అల్ట్రా డిజాస్టర్ చూసిన సంస్థకు పేరు పరంగా గరివిడి లక్ష్మి చాలా మేలు చేసింది. ఈ కోణంలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ హ్యాపీగానే ఉన్నారు. ఇంకో వారం కూడా బాగానే పెర్ఫార్మ్ చేసేలా ఉంది.
This post was last modified on October 20, 2026 11:28 pm
ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ప్రజలకు స్ఫూర్తిగా నిలబడాల్సిన లీడర్.…
దసరా సెలవులు ముగింపుకి వస్తున్న తరుణంలో ఒక విషయం బాగా అర్థమయ్యింది. సంక్రాంతి లాగా మరో కీలకమైన సీజన్ గా…
దసరా అంటే సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కు అతి పెద్ద పండగ. పది రోజుల దాకా సెలవులు ఉంటాయి కాబట్టి…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు…
రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు…
ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…