Political News

మేనకోడలి పెళ్లికి నో చెప్పిన జగన్?

ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఒక రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు. ప్రజలకు స్ఫూర్తిగా నిలబడాల్సిన లీడర్. కానీ సొంత చెల్లెలికే న్యాయం చేయలేకపోతున్నాడు. చేయలేక అనడం కంటే చేయడం లేదు. ఇంట్లో సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు, అవసరమైనప్పుడు అండగా నిలబడని నాయకుడు రాష్ట్రంలోని మహిళలకు ఏమి న్యాయం చేస్తాడు..? ఎలా అండగా ఉంటాడన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంతకూ ఏమి జరిగిందంటే…

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డికి అమెరికాలో స్థిరపడిన కర్నూలు జిల్లా వాస్తవ్యులు రఘురామిరెడ్డితో వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. నవంబర్ 25న వీరి వివాహం బెంగళూరులోని యలహంక‌ ప్యాలెస్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు షర్మిల పెళ్లి పత్రికలు కూడా పంపిణీ చేశారు. మరి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే యలహంక ప్యాలెస్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించడం లేదని ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తల్లి విజయలక్ష్మితో తెగేసి చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కారణమేదైనా చెల్లెలు మీద కోపం అంటే అర్ధం చేసుకోవచ్చు. మేనకోడలి మీద కూడా కోపం చూపించడం మాత్రం దారుణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పెళ్లి పత్రికలు వేసి పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులను ఆహ్వానించిన తరువాత ప్యాలెస్ ఇవ్వడం కుదరని చెప్పడం క్షమించరాని విషయమని సన్నిహితులు సైతం నొచ్చుకుంటున్నారు. ప్రజాజీవితంలో వున్న వ్యక్తి భావోద్రేకాలను అదుపులో ఉంచుకోలేక పోవడం సమర్ధనీయం కాదని చెబుతున్నారు.

జగన్ వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇంట్లో విభేదాలను పరిష్కరించుకోలేక పోవడం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం చవి చూడాల్సి వచ్చిందని, ఇప్పటికైనా దాన్నుంచి గుణపాఠం నేర్చుకోక పోవడం జగన్ మొండివైఖరిని నిరూపిస్తుందని వైరి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. చెల్లెలితో ఆయన వ్యవహారిస్తున్న తీరు పట్ల ఇంటా బయటా వస్తున్న విమర్శలను లెక్కచేయక పోవడం చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on October 20, 2026 11:22 pm

Share

Recent Posts

లక్ష్మికి ఇంకొంచెం సమయం దొరికి ఉంటే

ఒకపక్క రజనీకాంత్ జైలర్ 2, ఇంకోవైపు ప్యాన్ ఇండియా మూవీ రణబాలి. రెండూ మంచి బజ్ తెచ్చుకున్నాయి. బడ్జెట్, బిజినెస్…

14 minutes ago

వెంకటేష్‌కు దూరమయ్యింది విజయ్‌కు వరమయ్యింది

దసరా సెలవులు ముగింపుకి వస్తున్న తరుణంలో ఒక విషయం బాగా అర్థమయ్యింది. సంక్రాంతి లాగా మరో కీలకమైన సీజన్ గా…

49 minutes ago

టిఎఫ్ఐ అభిమానులకు కిక్కు రాలేదు

దసరా అంటే సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కు అతి పెద్ద పండగ. పది రోజుల దాకా సెలవులు ఉంటాయి కాబట్టి…

2 hours ago

నాగవంశీ జాక్‌పాట్ వెనుక అనిరుధ్?

సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్-2’కు విడుదల ముంగిట పెద్దగా హైప్ ఏమీ కనిపించలేదు. ఆ సినిమా ప్రోమోలు…

3 hours ago

రప్పా రప్పా మనకొద్దు… కూటమికి జై కొట్టండి

రప్పా రప్పా రాజకీయాలు మనకు వద్దని, రాష్ట్రాన్ని భయం నీడలో బతికే పరిస్థితికి తిరిగి తీసుకురావొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు…

4 hours ago

రజినీ అంటే పిచ్చి… స్టార్ క్రికెటర్ ఏం చేశాడంటే?

ప్రతి స్టార్ హీరోకూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫిలిం ఇండస్ట్రీలోనే కాక వివిధ రంగాల ప్రముఖుల్లో కూడా డై హార్ట్…

7 hours ago