ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి, చూడకపోవడానికి చిత్రమైన కారణాలు వెతుక్కుంటున్నారు. ఆర్టిస్టుల వ్యక్తిగత ప్రవర్తనను, వారి మాటలను బట్టి కూడా సినిమాలకు వెళ్లాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటున్నారు. ఏ చెడు ఉద్దేశం లేకుండా ఒక కామెంట్ చేసినా, ఏదైనా అంశం మీద తమ అభిప్రాయం చెప్పినా, వాస్తవాలే మాట్లాడినా సరే.. ఆ వ్యాఖ్యల్లో దురుద్దేశాన్ని వెతికి, వాటిని సినిమాకు ముడిపెట్టి.. టార్గెట్ చేస్తున్నారు.
కొన్నేళ్లుగా ఈ ట్రెండు నడుస్తోంది. గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ఒక కామెంట్ వల్ల ఇప్పటికే ఒకసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఏదో ఒక ఇంటర్వ్యూలో మన సైనికులను మనం హీరోలుగా చూసినట్లే, పాకిస్థాన్ సైనికులు ఆ దేశ ప్రజలకు హీరోలు కదా అంటూ ఏదో కామెంట్ చేసిందని ఆమెను కొంత కాలం పాటు లక్ష్యంగా చేసుకున్నారు.
ఇప్పుడు కన్నడిగులు ఒక సిల్లీ రీజన్‌తో ఆమె మీద ద్వేషం చూపిస్తున్నారు. తాజాగా జగపతిబాబు నిర్వహించే టాక్ షోకు సాయిపల్లవి అతిథిగా వచ్చింది. ఇందులో తనకున్న బహు భాషా ప్రావీణ్యాన్ని ఆమె బయటపెట్టుకుంది. బాగున్నారా అనే మాటను వివిధ భాషల్లో ఆమె పలికి చూపించింది. ఈ క్రమంలోనే కన్నడలో ఆ మాటను ఏమంటారు అని అడిగాడు జగపతిబాబు. ఐతే తనకు కన్నడ రాదని, ఈ మాట చెప్పలేనని స్కిప్ చేసింది సాయిపల్లవి. జగపతి సరదాగా.. ఈ మాట గుర్తుపెట్టుకోండి అన్నారు.
ఐతే ఈ విషయాన్ని కన్నడిగులు సీరియస్‌గా తీసుకుని ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మిగతా భాషలు నేర్చుకుని, కన్నడ మాత్రం రాదంటుందా అంటూ ఆమె మీద ఫైరైపోతున్నారు. ఈ కారణంతో ‘రామాయణం’ సినిమా చూడమంటూ శపథాలు కూడా చేస్తున్నారు. కానీ సాయిపల్లవి ఇప్పటిదాకా కన్నడలో ఒక్క సినిమా చేయలేదని, కాబట్టే ఆమెకు ఆ భాష రాదనే చిన్న లాజిక్‌ను కన్నడిగులు అర్థం చేసుకోకపోవడం విడ్డూరం.
This post was last modified on October 20, 2026 10:20 am
పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…
ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో…
ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం: పార్ట్1’ సినిమా. రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల…
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ పరిణామాలు చూస్తుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ జీరో అయిపోయింది. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి…
ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…
ఇతర భాషలకు చెందిన సినీ జనాలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినపుడు కొంచెం కష్టపడి బాగున్నారా అని..…