Political News

వంగవీటి రాధా అందరివాడు

విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి జనసేన తరపున కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగవీటి రాధాకృష్ణ పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు టీడీపీ స‌హా బీజేపీ నాయ‌కులు చెక్ పెట్టారు. జ‌న‌సేన త‌ర‌ఫున రాధా బ‌రిలో దిగిన‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని.. బీజేపీ నాయ‌కులు కూడా దూరంగా ఉంటున్నార‌ని సోష‌ల్ మీడియాలో అనేక విమ‌ర్శ‌లు వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి. ఇది చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు విజ‌య‌వాడ కార్పొరేష‌న్ సీటును టీడీపీ నేత ఒక‌రు ఆశించ‌డం, ఆయ‌న‌కు ద‌క్క‌క పోవ‌డంతో ఈ చ‌ర్చ‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఈ ప‌రిణామాలు ముదురుతున్న క్ర‌మంలో రాధా విష‌యంపై టీడీపీ స‌హా బీజేపీ స్పందించాయి. `రాధా అంద‌రివాడు. ఆయ‌న‌ను ఏక‌గ్రీవంగా గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. ఆయ‌న ఎంపిక‌ను పార్టీలు ఆమోదించాయి“ అని సోమ‌వారం రాత్రి టీడీపీ నుంచి ప్ర‌క‌ట‌న వచ్చింది. ఇక‌, బీజేపీ కూడా తాము పూర్తిగా రాధాకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలిపింది. ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు త్వ‌ర‌లోనే బృందాన్ని నియ‌మించ‌నున్న‌ట్టు క‌మ‌ల నాథులు తెలిపారు. ఈ క్ర‌మంలో మరో కోణం కూడా తెర‌మీదికి వ‌చ్చింది. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌రిలో నిలిచారు.

ఆయ‌న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి కావ‌డంతో విజ‌య‌వాడ‌లోని క‌మ్మ‌లంద‌రూ ఆయ‌న‌కే సపోర్టు చేస్తార‌ని.. దీనికి టీడీపీ నాయ‌కుల మ‌ద్ద‌తు కూడా ఉంద‌ని మ‌రో ప్ర‌చారం తెర‌మీదికి వ‌చ్చింది. దీనిని కూడా టీడీపీ ఖండించింది. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందరూ చూస్తున్నారు. ఇప్పుడు విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ లో కూడా కూటమి అభ్యర్ధినే గెలిపించుకుందాం. కులాల ప్రస్తావన లేని సంక్షేమ రాజ్యాన్ని సాధించుకుందాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సంయుక్తంగా నిలబెట్టిన వంగవీటి రాధాకృష్ణను తిరుగులేని మెజారిటీతో గెలిపించాలి. అని టీడీపీ పేర్కొంది.

అదే స‌మ‌యంలో క‌మ్మ‌-కాపు అంటూ.. కులతత్వం రెచ్చగొడుతున్న వారికి దీటుగా సమాధానం ఇవ్వాలని టీడీపీ శ్రేణుల‌కు పిలుపుని చ్చింది. కులం పేరుతో ఎవరు ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా కూటమి ఓటు చీలకుండా వంగవీటి రాధాకృష్ణను గెలిపించాల‌ని సూచించింది. విజయవాడ కార్పొరేషన్ ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ఈ విజ‌యం దోహ‌ద ప‌డాల‌ని పేర్కొంది. మ‌రోవైపు.. రాధాను టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు గ‌ద్దె అనురాధ‌(ఎమ్మెల్యే రామ్మోహ‌న్ స‌తీమ‌ణి), బుద్ధా వెంక‌న్న‌లు క‌లుసుకుని మ‌ద్ద‌తు ప‌లికారు. బీజేపీనేత‌లు కూడా క‌లుసుకుంటార‌ని ఆ పార్టీ నాయ‌క‌త్వం ప్ర‌క‌టించింది. దీంతో రాధా విజ‌యం అల‌వోకేన‌న్న వాద‌న‌కు బ‌లం చేకూర్చిన‌ట్టు అయింది.

This post was last modified on October 20, 2026 1:25 pm

Share

Recent Posts

ముద్ర‌గ‌డ కుటుంబ రాజకీయానికి అడ్డుకట్ట వేస్తుంది ఎవరు?

వైసీపీ త‌ర‌ఫున ముద్ర‌గ‌డ కుటుంబానికి ద‌క్కుతున్న ఆద‌ర‌ణ ఎంత‌? ప‌ద్మ‌నాభం మృతి చెందిన త‌ర్వాత‌.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని చెప్పిన…

17 minutes ago

త్రివిక్రమ్‌ గుర్తించాల్సిన అసలు ముప్పు

ఆదర్శ కుటుంబం అఫీషియల్ డేట్ కేవలం పది రోజుల ముందు వచ్చింది. వెంకటేష్ ద్వారా ఆన్ లైన్ అనౌన్స్ మెంట్…

37 minutes ago

ప్రతిసారీ పోలికంటే ఎలా తమన్?

పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…

2 hours ago

ఈ కారణంతో సాయిపల్లవిని ద్వేషించడమా?

ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి,…

2 hours ago

ఇండస్ట్రీ హిట్… ఎవ్వరికీ ఇవ్వవా రజినీ?

ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో…

3 hours ago

ఆదిపురుష్ భయం.. రామాయణంను వెంటాడుతోందా?

ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం: పార్ట్1’ సినిమా. రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల…

6 hours ago