ఎప్పుడో 1998లో కమల్ హాసన్ ‘ఇండియన్’ సినిమాతో తమిళంలో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. అప్పట్నుంచి 28 ఏళ్లు గడిచాయి. ఇన్నేళ్లలో ఇండస్ట్రీ హిట్ అంటే ఒక్క రజినీకాంత్‌కే సొంతం అన్నట్లు తయారైంది. రికార్డు పెడితే సూపర్ స్టారే పెట్టాలి. దాన్ని బద్దలు కొట్టినా ఆయనే కొట్టాలి అన్నట్లు తయారైంది. 80, 90 దశకాల్లో కూడా రజినీ ఇండస్ట్రీ హిట్లు కొట్టాడు. కానీ వాటిని వేరే హీరోలు బద్దలుకొట్టారు.
కానీ ‘ఇండియన్’ సినిమా రికార్డులను ‘పడయప్పా’ (నరసింహా)తో అధిగమించాక.. రజినీని అందుకునే హీరోనే లేకపోయారు. అంతకుముందు వరకు కమల్..రజినీకి దీటుగా నిలిచేవాడు. కానీ క్రమంగా ఆయన జోరు తగ్గిపోయింది. మరోవైపు విజయ్, అజిత్ పెద్ద రేంజికి ఎదిగారు. సూర్య కూడా టాప్ లీగ్‌లోకి వచ్చాడు. కానీ వీళ్లందరిదీ ఒక లీగ్ అయితే.. రజినీ ఒక్కడిది వేరే లీగ్ అన్నట్లు తయారైంది.
తెలుగులో, మలయాళంలో, కన్నడలో కూడా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకుని, కొంత మేర ఉత్తరాదిన కూడా పాగా వేసిన రజినీ.. ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. విదేశాల్లో కూడా ఆయన మార్కెట్ తిరుగులేని స్థాయికి చేరుకుంది. ఇంకేముంది ఇండస్ట్రీ హిట్ కొట్టేది ఆయనే.. బద్దలు కొట్టేది ఆయనే అన్నట్లు తయారైంది పరిస్థితి. పడయప్పా తర్వాత చంద్రముఖి (2005), శివాజీ (2007), రోబో (2010), కబాలి (2016), 2.0 (2018).. ఇలా ఇండస్ట్రీ హిట్లు కొడుతూ పోయారు సూపర్ స్టార్.
మధ్యలో విజయ్.. వరుస బ్లాక్ బస్టర్లతో రజినీని మించి ఎదుగుతున్నట్లు కనిపించాడు. దర్బార్, పేట, అన్నాత్తే లాంటి ఫెయిల్యూర్లతో రజినీ బాగా డౌన్ అయ్యాడు. దీంతో ఆయన పనైపోయిందనుకున్నారంతా. కానీ 2023లో ‘జైలర్’తో మళ్లీ తనే కొత్త ఇండస్ట్రీ హిట్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు ‘జైలర్-2’తో మళ్లీ తన రికార్డును తానే బద్దలు కొట్టబోతున్నాడు. అన్నీ కలిసొస్తే ఈ చిత్రం తమిళంలో తొలి వెయ్యి కోట్ల సినిమా అయినా ఆశ్చర్యం లేదు. ఆ ఘనత మొదటగా సాధించిన హీరోగా కూడా రజినీనే నిలవబోతున్నారన్నమాట.
This post was last modified on October 20, 2026 10:15 am
పేరుకేమో తెలుగులో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు అతనే కావాలంటారు. భారీ సినిమాలకు పని…
ఒకప్పుడు నటీనటుల అందచందాలు, యాక్టింగ్ స్కిల్స్‌ను బట్టే సినిమాలు చూసేవారు జనాలు. కానీ సోషల్ మీడియా జమానాలో సినిమాలు చూడ్డానికి,…
ఇంకో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘రామాయణం: పార్ట్1’ సినిమా. రెండు భాగాలకు కలిపి ఏకంగా రూ.4 వేల…
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ పరిణామాలు చూస్తుంటే కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ జీరో అయిపోయింది. సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి…
ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…
ఇతర భాషలకు చెందిన సినీ జనాలు తమ సినిమాల ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చినపుడు కొంచెం కష్టపడి బాగున్నారా అని..…