Movie News

టైగర్ కు బుల్లెట్ గాయాలు తగిలాయా?

నిన్న రాత్రి నుంచి బాలీవుడ్ గజగజ వణికిపోతోంది. కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ తారలకు డెత్ థ్రెట్స్ ఇస్తూ వస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. నిన్న దారుణానికి ఒడిగట్టింది. బాలీవుడ్ స్టార్లలో ఒకడైన టైగర్ ష్రాఫ్ మీద ఈ గ్యాంగ్‌కు చెందిన మనుషులు తుపాకీలతో దాడికి దిగడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. కారులో ప్రయాణిస్తుండగా… చాలా క్లోజ్ రేంజ్ నుంచి తుపాకీలతో టైగర్ కారు మీద దుండగులు గుళ్ల వర్షం కురిపించారు. అదృష్టం కొద్దీ ఆ దాడిలో టైగర్ ప్రాణాల నుంచి బయటపడ్డాడు. అతడి డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.

ఇలాంటి ఘటన తర్వాత ఎవ్వరైనా షాక్‌లో ఉండిపోతారు. కానీ టైగర్ మాత్రం వెంటనే తేరుకున్నాడు. డ్రైవర్ సీట్లోకి తనే మారిపోయి.. కారును ఆసుపత్రికి పోనిచ్చాడు. డ్రైవర్‌కు అత్యవసర చికిత్స అందేలా చూశాడు. ఈ ఘటన జరిగిన కాసేపటికే దాడికి తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాడి చేసిన వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఉదయానికల్లా ఆ దుండగులను పట్టేసుకున్నారు. ఈ దాడి వెనుక కుట్రను పూర్తి స్థాయిలో ఛేదించే ప్రయత్నంలో ఉన్నారు.

టైగర్ లాంటి స్టార్ హీరో మీద నడి రోడ్డు మీద జరిగిన ఈ దాడి బాలీవుడ్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అదృష్టం కొద్దీ టైగర్ బతికిపోయాడు కానీ.. అతడి ప్రాణం పోయుంటే ఏంటి పరిస్థితి.. బాలీవుడ్ స్టార్లకు ఓపెన్‌గా డెత్ థ్రెట్స్ ఇవ్వడమేంటి.. ఇలా దాడులకు తెగబడడం ఏంటి అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వడానికి టైగర్ ఇంటికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వెళ్లారు.

టైగర్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులతో షిండే మాట్లాడి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఈ సందర్భంగా షర్టు లేకుండా కనిపించాడు టైగర్. గొంతు కింద, చెస్ట్ మధ్యలో.. అలాగే భుజం మీద కట్లు కట్టినట్లు ఉండడం చూసి అతడికి కూడా స్వల్పంగా బుల్లెట్ గాయాలు తగిలాయా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. అలాగే కుడిచేతి మొత్తానికి బ్యాండేజ్‌తో కనిపించాడతను.

This post was last modified on October 19, 2026 3:01 pm

Share

Recent Posts

తొమ్మిది రోజుల ముందే రామాయణం మెగా ప్రిమియర్

ఏకంగా 4 వేల బడ్జెట్లో రూపొందుతున్న మెగా ప్రాజెక్టు.. రామాయణం. రెండు భాగాలుగా ఈ మెగా మూవీ తెరకెక్కుతుండగా.. ఫస్ట్…

2 hours ago

రామాయ‌ణం డైరెక్ట‌ర్ కూడా తెలుగు సినిమా పిచ్చోడే

ఇత‌ర భాష‌లకు చెందిన సినీ జ‌నాలు త‌మ సినిమాల ప్ర‌మోష‌న్ల కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కొంచెం క‌ష్ట‌ప‌డి బాగున్నారా అని..…

3 hours ago

వైబ్ సరిపోవడం లేదు తమన్ సాబ్

ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి రెండో ఆడియో సింగల్ వచ్చేసింది. మాలా తెచ్చా పాలు అంటూ రామజోగయ్య శాస్త్రి…

3 hours ago

ఎవ‌రీ లారెన్స్ బిష్ణోయ్‌?

బాలీవుడ్ న‌టుడు టైగ‌ర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘ‌ట‌న ఇప్పుడు దేశ్యాప్తంగా సంచ‌లనం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ముంబ‌యిలో ఫుట్…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్‌ని తవ్వుతున్న కాకా

సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…

5 hours ago

అనంత‌పురం అంటే అంతే సార్‌!

అనంత‌పురం జిల్లా అంటేనే రాజ‌కీయాల‌కు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నికల స‌మ‌యంలోనూ ఈ జిల్లా…

8 hours ago