Movie News

లైలా ఎందుకు తీశావ్ విశ్వక్ అన్నా

ప్రతి హీరో కెరీర్లో ఫ్లాపులు ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఆ పేర్లు తలుచుకోవడానికి కూడా భయపడే రేంజిలో డిజాస్టర్లు అవుతుంటాయి. ట్రోల్ మెటీరియల్స్‌గా మారి ఆ హీరోలకు అవమాన భారాన్ని మిగులుస్తాయి. యువ కథానాయకుడు విశ్వక్సేన్ కెరీర్లో ‘లైలా’ అలాంటి సినిమానే. రాజేంద్ర ప్రసాద్ చేసిన ‘మేడమ్’ తరహా హీరో అమ్మాయి అవతారం ఎత్తే సినిమా ఇది.

కానీ ఈ కథను చాలా పేలవంగా డీల్ చేయడంతో సినిమా ప్రేక్షకులకు చుక్కలు చూపించింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్‌గా నిలవడమే కాక.. సోషల్ మీడియాలో విశ్వక్ మీద బాగా ట్రోలింగ్‌కు దారి తీసింది. అందుకే విశ్వక్ ఈ సినిమాను రిలీజ్ తర్వాత ప్రమోట్ చేయలేదు. ఆ తర్వాత కూడా దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఐతే తన కొత్త చిత్రం ‘కల్ట్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఒక అభిమాని ‘లైలా’ ప్రస్తావన తెచ్చాడు.

స్టేజ్ మీద విశ్వక్ మాట్లాడుతుండగా.. ‘‘లైలా సినిమా ఎందుకు తీశావన్నా’’ అంటూ గట్టిగా అరిచాడు. ముందు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లు నవ్వేసిన విశ్వక్.. తర్వాత ‘‘లైలా తీశాకే ఇది తీయబుద్ధేసిందిరా’’ అని బదులిచ్చాడు. ‘కల్ట్’ విశ్వక్ సొంత స్క్రిప్టు, స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం విశేషం. ఇండియాలో ఇప్పటిదాకా ఎవ్వరూ తీయని ‘శ్లాషర్’ జానర్లో తెరకెక్కిన సినిమాగా దీన్ని టీం ప్రమోట్ చేస్తోంది.

ఈసారి డిఫరెంట్ జానర్లోకి అడుగుపెట్టడం గురించి విశ్వక్ స్పందిస్తూ.. తాను ప్రయోగాలు చేసినపుడు ప్రేక్షకులు బాగా ఆదరించారని.. అలా కాకుండా ప్రేక్షకులకు ఇది నచ్చుతుందేమో అని కమర్షియల్ సినిమాలు చేసినపుడు మాత్రం అవి ఫెయిలయ్యాయని చెప్పాడు. దీన్ని బట్టి తనకు అర్థమైందేంటంటే.. ప్రయోగాత్మక చిత్రాలే తనకు కమర్షియల్ సినిమాల మాదిరి అని.. కాబట్టి ఇక నుంచి ప్రయోగాలే చేస్తూ ముందుకు వెళ్తానని విశ్వక్ స్పష్టం చేశాడు. ‘కల్ట్’కు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు అందించడం విశేషం. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on October 19, 2026 12:42 pm

Share

Recent Posts

అనంత‌పురం అంటే అంతే సార్‌!

అనంత‌పురం జిల్లా అంటేనే రాజ‌కీయాల‌కు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎన్నికల స‌మ‌యంలోనూ ఈ జిల్లా…

35 minutes ago

పి సుశీల బయోపిక్‌లో రుక్మిణి వసంత్

బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…

47 minutes ago

మన సీనియర్ స్టార్లను ఎందుకు ప్రశ్నించాలి

జైలర్ 2 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా యువతకు ఒక పెద్ద సందేహం వస్తోంది. మన సీనియర్లు కూడా ఇలా…

2 hours ago

ఓటుకు 4 వేలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు

ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇవ్వడం చట్టపరంగా నేరం. కానీ, మన దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ చట్టం…

2 hours ago

ఇండియన్-3 ఫ్రీగా చేస్తున్నట్లేనా?

‘ఇండియన్’ లాంటి ఆల్ టైం కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసి గట్టిగానే తల బొప్పి కట్టించుకున్నారు శంకర్,…

2 hours ago

నామినేషన్ పత్రాలను ఎవరు చింపారు?

క‌డ‌ప‌జిల్లా మైదుకూరులో ఈ నెల 28న జ‌ర‌గాల్సిన స్థానిక ఎన్నిక‌ల‌పై ఎన్నిక‌ల సంఘం స్టే విధించింది. దీనిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు…

3 hours ago