వరుస ఫ్లాపులు రావడం వల్లే రూటు మార్చి, మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి కల్ట్ తీశానని చెబుతున్న విశ్వక్ సేన్, అందులో చూపించిన వయొలెన్స్ ఎవరి కోసం ఉద్దేశించిందో ముందే చెబుతూ ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తున్న వైనం నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించింది. స్క్విడ్ గేమ్ తరహాలో హత్యలు, అరాచకాలతో నిండిపోయిన విజువల్స్ చూసి అభిమానులే ఆశ్చర్యపోయారు. ఇంత బోల్డ్ వయొలెంట్ కంటెంట్ తన నుంచి ఆశించకపోవడం వల్ల సర్ప్రైజ్ ఫీలవుతున్నారు.
అయితే ఎంత ఏ సర్టిఫికెట్ అయినా, పెద్దలకు మాత్రమే అని ముందే చెప్పినా కేవలం వాళ్ళతోనే భారీ థియేటర్ రెవిన్యూ సాధించడం అంత ఈజీ కాదు. ప్యారడైజ్, యానిమల్ లాంటివి కూడా ఇదే క్యాటగిరీలోకి వస్తాయి కానీ వాటిలో ఉన్న స్టార్ హీరోలకున్న మార్కెట్ దృష్ట్యా బిజినెస్ పరంగా పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ విశ్వక్ రేంజ్ వేరు. తనకు గుర్తింపు, యూత్ లో ఫాలోయింగ్ ఉన్నా పెద్ద నెంబర్లకు దారి తీసే స్థాయిలో లేదనేది వాస్తవం. అలాంటప్పుడు కల్ట్ లాంటివి రిస్కేగా.
నిజానికి విశ్వక్ సేన్ అన్ని జానర్లకు సూటవుతాడు. అశోక వనంలో అర్జున కళ్యాణంలో సాఫ్ట్ క్యారెక్టర్ చేసినా, గామిలో అఘోరాగా మెప్పించినా, గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో ఊర మాస్ ట్రై చేసినా చెప్పుకోదగ్గ ఫలితాలే వచ్చాయి. ఇమేజ్ కి పొంతన లేకుండా చేసిన లైలా లాంటివి దారుణంగా బోల్తా కొట్టాయి. ఫంకీ పోయింది విశ్వక్ వల్ల కాదు దర్శకుడు అనుదీప్ తేలికైన డైరెక్షన్ వల్ల. సో విశ్వక్ తనను తాను అన్నింటికి బాధ్యుడిగా భావించి ఇప్పుడీ వయొలెంట్ బాట పట్టినట్టు కనిపిస్తోంది.
కల్ట్ ఎలా ఉండబోతోందనేది పక్కనపెడితే కాంపిటీషన్ అయితే తీవ్రంగా ఉండబోతోంది. వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఏకె 47 అదే డేట్ కి వస్తుందని ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర సమాచారముంది. ఇట్లు అర్జునకు అన్నపూర్ణ స్టూడియోస్ మద్దతు దక్కడంతో ప్రమోషన్లు బాగానే చేసుకుంటోంది. చిన్న సినిమా అయినా సమ్మర్ హాలిడేస్ సౌండ్ పెంచే ప్రయత్నాల్లో ఉంది. వీటి మధ్య కల్ట్ నెగ్గుకురావాల్సి ఉంటుంది. తరుణ్ భాస్కర్ సంభాషణలు సమకూర్చిన కల్ట్ కు రవి బస్రూర్ సంగీతం అందించారు.
This post was last modified on October 19, 2026 12:59 pm
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ మీద కాల్పుల ఘటన ఇప్పుడు దేశ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ముంబయిలో ఫుట్…
సోషల్ మీడియా జమానాలో పెద్ద సినిమాల లీకులు ఆపడం దర్శక నిర్మాతలకు చాలా కష్టమైపోయింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటిని…
అనంతపురం జిల్లా అంటేనే రాజకీయాలకు ముఖ్యంగా ఫైర్ పాలిటిక్స్‌కు కేంద్రం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలోనూ ఈ జిల్లా…
బయోపిక్ ట్రెండ్ మళ్ళీ మొదలైపోయింది. మహానటి సావిత్రి టైంలో ఈ జానర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ సిరీస్…
నవంబర్ 5 విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు పంపిణి చేయనుండటంతో పెద్ద రిలీజ్…
జైలర్ 2 సక్సెస్ తర్వాత సోషల్ మీడియా యువతకు ఒక పెద్ద సందేహం వస్తోంది. మన సీనియర్లు కూడా ఇలా…