Political News

మాట మీద నిలబడతారా జగన్?

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. స్థానిక ఎన్నికలలో ఎక్కడైనా సరే ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే ఆ నియోజకవర్గం ఇంచార్జికి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు ఇవ్వనంటూ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ హెచ్చరిక ఆయనకే రివర్స్ అయినట్లుంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో సుమారు 16 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మరి జగన్ పులివెందుల సీటు గురించి ఏమంటారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి.

ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీకి చైర్మన్ సహా ఒక్క వార్డుకు కూడా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. దాంతో ఇక్కడ జనసేన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే ప్రచారం జరుగుతుంది. రాయలసీమలోని కమలాపురంలో కూడా వైసీపీ నుంచి చైర్‌పర్సన్‌కు కానీ వార్డులకు కానీ ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. దీంతో టీడీపీకి దాదాపు ఏకగ్రీవమైనట్లేనని చెబుతున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో వైసీపీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా ఎవరూ నామినేషన్‌ వేయలేదు. ఇక్కడ కూడా టీడీపీకి ఏకగ్రీవమైనట్టేనని చెబుతున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 5 వార్డుల్లో వైసీపీ పోటీ చేయలేదు. గుత్తిలో మొత్తం 32 వార్డులు వుండగా 8 చోట్ల మాత్రమే నామినేషన్ వేశారు. ఎర్రగుంట్లలో సైతం ఇదే పరిస్థితి. ఇక్కడ కేవలం ఒక్క వార్డుకు మాత్రమే వైసీపీ పోటీకి దిగింది. దాంతో ఎర్రగుంట్ల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెబుతున్నారు. తిరుపతి కార్పొరేషన్లో కూడా 19 డివిజన్లకు వైసీపీ నామినేషన్లు వేయలేదని సమాచారం. పుంగనూరులో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పెద్దిరెడ్డి ప్రకటించడం తెలిసిందే. రాయచోటిలో కూడా చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్ వేయలేదు.

మొత్తం మీద అనేక నియోజకవర్గాల్లో వైసీపీ నామినేషన్లు వేయలేక పోయింది. జగన్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగే నాయకుల నియోజకవర్గాల్లోనే ఏకగ్రీవాలు జరిగినట్లు సమాచారం వస్తుంది. మరి జగన్ ఈ నాయకులకు రేపటి ఎన్నికల్లో సీటు ఇస్తారా లేదా అనేది వేచి చూడాలని కూటమి నాయకులు సెటైర్లు వేస్తున్నారు. అధికారం కోల్పోయి రెండున్నరేళ్ళయినా వైసీపీ ఇంకా కోలుకోలేదని ఈ ఎన్నికలు రుజువు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

జ‌గ‌న్ ఈ విష‌యంలో త‌ప్పించుకునేందుకు, త‌న వారిని ర‌క్షించుకునేందుకు స‌ర్కారుపై వ్యూహాత్మ‌క దాడి చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త‌మ‌ను నామినేష‌న్లు వేయ‌కుండా టీడీపీ వారే అడ్డుకున్నార‌ని ఆయ‌న చెబుతున్నారు. పోలీసులు సైతం వారికి స‌హ‌క‌రించారని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న మ‌రిచిపోవ‌డ‌మో.. లేక ఎన్నిక‌ల సంఘం విష‌యంలో త‌ప్పు చేశామ‌ని చెప్పిన‌ట్టుగా ఈ విష‌యంలో కూడాత‌ప్పు చేశాన‌ని చెప్ప‌డ‌మో చేస్తార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక‌, నామినేష‌న్ వేయ‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కులే ఉండ‌డం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి వారిని త‌ప్పించే అవ‌కాశం లేదని కూడా అంటున్నారు.

This post was last modified on October 19, 2026 10:22 am

Share

Recent Posts

ఓటుకు 4 వేలు వస్తాయని ప్రజలు చూస్తున్నారు

ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ఇవ్వడం చట్టపరంగా నేరం. కానీ, మన దేశంలో ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఆ చట్టం…

5 minutes ago

ఇండియన్-3 ఫ్రీగా చేస్తున్నట్లేనా?

‘ఇండియన్’ లాంటి ఆల్ టైం కల్ట్ బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ తీసి గట్టిగానే తల బొప్పి కట్టించుకున్నారు శంకర్,…

17 minutes ago

నామినేషన్ పత్రాలను ఎవరు చింపారు?

క‌డ‌ప‌జిల్లా మైదుకూరులో ఈ నెల 28న జ‌ర‌గాల్సిన స్థానిక ఎన్నిక‌ల‌పై ఎన్నిక‌ల సంఘం స్టే విధించింది. దీనిని ర‌ద్దు చేస్తున్న‌ట్టు…

53 minutes ago

నువ్వా ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడేది

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు క‌నీస వ‌స‌తులు కూడా ఇవ్వ‌కుండా వారి…

1 hour ago

ఏం చేస్తే పవన్ సహించరో అదే చేశారు

పల్లె పండుగ కార్య‌క్ర‌మం కింద క‌ష్ట‌ప‌డి నిధులు తీసుకువ‌చ్చి రోడ్డు నిర్మించామ‌ని.. అయితే.. వ్య‌క్తిగ‌త అక్క‌సుతో ర‌హ‌దారిని ధ్వంసం చేసేశార‌ని…

2 hours ago

ఎక్క‌డ అన్యాయం జ‌రిగింది జ‌గ‌న్‌

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ వారిని నామినేష‌న్లు కూడా వేయ‌కుండా అడ్డుకున్నార‌ని.. అడుగ‌డుగునా అడ్డంకులు సృష్టించార‌ని ఆరోపిస్తూ.. గ‌గ్గోలు పెట్టిన…

2 hours ago