Movie News

మాలాని మించిన మేజిక్ జరగాలి

ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆదర్శ కుటుంబం అక్టోబర్ 30 రావడం పక్కానే. వెంకటేష్ ఊటీ నుంచి రాగానే ఇంకో వారం లోపే అనౌన్స్ మెంట్ ఇప్పిస్తామని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంబరాలకు రెడీ అవుతున్నారు. అయితే దసరా సెలవుల మూడ్ లో ఉన్న జనాలకు ఈ సినిమా చాలా మంచి ఆప్షనయ్యేది. కానీ వాయిదాల పర్వంలో నలిగిపోవడం వల్ల వెంకీకి దక్కాల్సిన ప్రయోజనాన్ని రజనీకాంత్, విజయ్ దేవరకొండ ఎంజాయ్ చేస్తున్న వైనం వసూళ్లలో కనిపిస్తోంది.

ఆదర్శ కుటుంబం కంటెంట్ లో ఇప్పటిదాకా బయటికి వచ్చింది చిన్న టీజర్, నారాయణమ్మ పాట మాత్రమే. రెండూ పర్వాలేదనిపించాయి తప్ప అదిరిపోయిందనే మాట వినిపించలేదు. నెక్స్ట్ వచ్చేవి ఆ మేజిక్ చేసి చూపించాలి. ఎల్లుండి రెండో సాంగ్ మాలాని విడుదల చేయబోతున్నారు. చేతికి పూల దండలతో దసరా బుల్లోడి వేషంలో వెంకీ మామ కొత్తగా ఉన్నారు. అయితే చూడగానే ఎగ్జైట్ మెంట్ అనిపించేలా లేదని సగటు మూవీ లవర్స్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయం.

అనిల్ రావిపూడి తరహా మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలాంటి సినిమాలకు చాలా అవసరం. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టయిల్ అది కాదు. అసలే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. అలాంటివి చేయడం కాదు కదా ఆలోచించే టైం కూడా లేదు. పైగా వెంకటేష్ జనవరి 12 విడుదల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఏదైనా ఐడియా ఆయనతో షేర్ చేద్దామన్నా రెస్పాన్స్ వచ్చేలోపు సమయం అయిపోయేలా ఉంది. ఇన్ని సమస్యల మధ్య ఆదర్శ కుటుంబంకి బజ్ పెంచాల్సి ఉంటుంది.

ఒకవేళ మాలా సాంగ్ కనక బాగుండి, వైరల్ అయిపోయి, సోషల్ మీడియాని ఊపేస్తే ఇంక టెన్షన్ పడాల్సిన పని ఉండదు. తమన్ కంపోజింగ్ ఆ స్థాయిలో ఉండాలి. ఇంకో రెండు పాటలు రావాల్సి ఉందని యూనిట్ టాక్. సినిమా మొత్తంలో ఎన్ని ఉంటాయనే దాని మీద సరైన సమాచారం లేదు. ఇదంతా పక్కనపెడితే ఆదర్శ కుటుంబం హైప్ మీటర్ పూర్తిగా ట్రైలర్ మీద ఆధారపడి ఉంది. అది కనక వావ్ అనిపిస్తే మటుకు ఓపెనింగ్స్ నుంచి దీపావళి వరకు వెంకీ సింగల్ బ్యాటింగ్ ఉంటుంది.

This post was last modified on October 17, 2026 6:33 pm

Share

Recent Posts

కంపెనీకి చివరి మెయిల్.. ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు!

భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…

3 hours ago

దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…

3 hours ago

ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…

4 hours ago

తెలుగు వాళ్లకు ఆయన చాలా స్పెషల్

వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన…

4 hours ago

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

5 hours ago

అందరికీ న్యాయం చేసిన టీడీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…

5 hours ago