Movie News

అనిరుధ్ పెళ్లి ఫిక్స్… ఆమె హర్ట్?

ప్రస్తుతం ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. అనిరుధ్ రవిచందర్ పేరే చెప్పుకోవాలి. బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ అయినా, అక్కడ ఎంతోమంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా సరే.. అనిరుధ్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, తన పాటలకు వచ్చే రీచ్ ముందు ఎవ్వరూ నిలవలేరు అంటే అతిశయోక్తి కాదు. టీనేజీలోనే అద్భుతాలు చేసిన ఈ కుర్రాడు.. ఇప్పుడు ఎవ్వరూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయాడు.

‘జైలర్-2’తో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్న అనిరుధ్.. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌ దిశగా దూసుకెళ్తున్న సమయంలోనే తన పెళ్లి గురించి అధికారికంగా చెప్పకనే చెప్పేశాడు. సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ తనయురాలు.. ఐపీఎల్ టీం సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్‌తో అతడి పెళ్లి జరగబోతోంది. నవంబరు 10న గ్రీస్‌లో పెళ్లి కాగా.. 21న చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం అతిథులను పిలిచే పనిలో పడ్డాయి అనిరుధ్, కావ్య కుటుంబాలు.

ఐతే అనిరుధ్ పెళ్లి వార్త అధికారికంగా బయటికి వచ్చిన సమయంలోనే ఒక ఫేమస్ సింగర్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఆమే.. జోనిత గాంధీ. అనిరుధ్ సంగీతంలో ‘అలమితి హబీబీ’ సహా ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు పాడింది జోనిత. అనిరుధ్‌తో ప్రొఫెషనల్‌గా అసోసియేట్ అయిన సమయంలో ఆమె అతడితో ప్రేమలో పడిందనే వార్తలు వచ్చాయి. తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరూ ఎప్పుడూ దాని గురించి స్పందించింది లేదు.

ఐతే ఇప్పుడు అనిరుధ్ పెళ్లి గురించి అఫీషియల్ అప్‌డేట్ వచ్చిన సమయంలో జోనిత ఇన్‌స్టాలో ఒకపాటను షేర్ చేయడం చర్చనీయాంశం అయింది. ‘డ్యూడ్’ సినిమాలో ఆమె పాడిన బ్రేకప్ సాంగ్‌ను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ఎందుకో ఈ పాట పదే పదే గుర్తుకు వస్తోందని కామెంట్ చేసింది. సినిమాలో ఆ పాట వచ్చే సందర్భం, ప్రస్తుతం అనిరుధ్ పెళ్లి వార్త బయటికి రావడం.. ఈ రెంటినీ కనెక్ట్ చేసి చూస్తున్న నెటిజన్లు.. గతంలో అనిరుధ్, జోనిత రిలేషన్‌షిప్‌లో ఉన్నది నిజమే అన్నమాట అని చర్చించుకుంటున్నారు.

This post was last modified on October 17, 2026 4:33 pm

Share

Recent Posts

కంపెనీకి చివరి మెయిల్.. ఇంట్లో భార్యాభర్తల మృతదేహాలు!

భార్య పుట్టినరోజు నాడే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అంతకుముందు ఉదయం ఆ ఉద్యోగి…

2 hours ago

దుల్కర్ సల్మాన్‌కు ఇక్కడే రాసిపెట్టి ఉంది

మామూలుగా పెద్ద స్టార్ల కొడుకులు సినీ రంగంలోకి అడుగుపెడితే.. తండ్రి పేరును వాడుకోవడానికే ప్రయత్నిస్తారు. తండ్రి రెఫరెన్సులను తమ సినిమాల్లో…

2 hours ago

ప్రభుత్వమే తెచ్చిన డేటింగ్ యాప్ కానీ…

యువత పెళ్లిళ్లకు దూరంగా ఉండడంతో సింగపూర్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. పెళ్లి చేసుకోవాలనుకునే యువతీ యువకులను…

3 hours ago

తెలుగు వాళ్లకు ఆయన చాలా స్పెషల్

వారం కిందటే భారతీయ సినీ పరిశ్రమ నానా పటేకర్ లాంటి గొప్ప నటుడిని కోల్పోయింది. ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్న ఆయన…

3 hours ago

రవితేజ రూటు పట్టిన అల్లరి నరేష్

ఇరుముడి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక కొత్త ఫార్ములా సృష్టించింది. మాములుగా స్టార్ హీరోలు దేవుళ్ళ మాల వేసుకునే క్యారెక్టర్లు…

4 hours ago

అందరికీ న్యాయం చేసిన టీడీపీ

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. మంచి ముహుర్తాలు ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు హడావుడిగా నామినేషన్లు…

4 hours ago