Movie News

జైలర్-3 కూడా ఉన్నట్లేనా?

భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా.. జైలర్-2. అంచనాలకు తగ్గ రేంజిలో లేకపోయినా.. పైసా వసూల్ ఎంటర్టైనర్ అనే టాక్ వస్తోంది ఈ చిత్రానికి. సౌత్ ఇండియన్ సినిమాలో సీక్వెల్స్.. ఎప్పుడూ ఒరిజినల్స్ కంటే తక్కువ స్థాయిలోనే ఉంటాయి. మాతృకను మించి సీక్వెల్ గొప్పగా అనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ‘జైలర్-2’కు వస్తున్న టాక్ చూస్తే.. ఇది కంటెంట్, వసూళ్ల పరగా ‘జైలర్’ను అధిగమించడం సందేహంగానే ఉంది. ఐతే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రం చాలా ధీమాగా ‘జైలర్-3’కి లీడ్ సీన్ పెట్టేశాడు. ఈ సినిమా చివర్లో రజినీ అరెస్టయి పోలీస్ జీపు ఎక్కుతాడు.

ఆయన్ని తీసుకెళ్లే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి తళుక్కున మెరిశాడు. ‘జైలర్’లో మాదిరే ‘జైలర్-2’లో చాలా క్యామియోలు ఉండగా, వాటి గురించి ముందే హింట్ వచ్చింది. హృతిక్ రోషన్ క్యామియో గురించి కూడా న్యూస్ ఎప్పుడో లీక్ అయింది. కానీ ఇందులో విజయ్ సేతుపతి కూడా కనిపించనున్న విషయంలో మాత్రం సీక్రెట్‌గా బాగానే దాచారు. ఐతే ఇది జస్ట్ క్యామియో కాదు, ‘జైలర్’ ఫ్రాంఛైజీలో మరో సినిమా దిశగా లీడ్ ఇచ్చిన పాత్ర అని భావిస్తున్నారు.

మూడో ‘జైలర్’లో సేతుపతినే ప్రధాన విలన్‌గా చూపించాలని నెల్సన్ ఫిక్సయినట్లున్నాడు. కానీ అతనా సినిమా తీయాలి అంటే ‘జైలర్’ తరహాలోనే ‘జైలర్-2’ కూడా పెద్ద హిట్టవ్వాలి. ఒకవేళ వసూళ్లు వచ్చినా సరే.. ‘జైలర్-2’కే మొనాటనస్ ఫీలింగ్ వచ్చిన నేపథ్యంలో ప్రేక్షకులు ఇంకో సినిమా చూడ్డానికి రెడీగా ఉంటారా అన్నది సందేహం.

సేతుపతి ఇంతకుముందే రజినీ సినిమాలో ఒకసారి నెగెటివ్ రోల్ చేశాడు. ‘పేట’లో సూపర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. కానీ అందులో అతడిది పూర్తి స్థాయి విలన్ పాత్ర కాదు. రజినీని ఢీకొట్టేలా ఆ పాత్ర ఉండదు. మరి ‘జైలర్-3’కు అన్నీ కుదిరి.. రజినీ, సేతుపతి మధ్య పూర్తి స్థాయి క్లాష్‌ను స్క్రీన్ మీద చూసే అవకాశం దక్కుతుందేమో చూడాలి.

This post was last modified on October 15, 2026 4:59 pm

Share

Recent Posts

శ్రీలీల తెరంగేట్రానికి మోక్షం దొరికింది

అదేంటి శ్రీలీల ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలయ్యింది ఇప్పుడు తెరంగేట్రం ఏమిటనుకుంటున్నారా. అసలు విషయం వేరే ఉంది. తొమ్మిది సంవత్సరాల…

46 minutes ago

కూట‌మిగానే ముందుకు… సీట్ల లెక్క‌లు త‌ర్వాతే!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది. మూడు ద‌శ‌ల్లో ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. అయితే.. షెడ్యూల్ వ‌చ్చే వ‌ర‌కు…

56 minutes ago

జ‌న‌సేన ఎంట్రీతో వంగ‌వీటికి పూర్వ వైభ‌వం వ‌చ్చేనా!

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి రంగా కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. రంగా జీవించి ఉన్న రోజుల్లో.. ఆయ‌న తూర్పు నియోజ‌క…

2 hours ago

చిరుకు నో హీరోయిన్.. నో రొమాన్స్.. నో డ్యూయెట్

మన స్టార్ హీరోలకు ఎంత వయసు వచ్చినా సరే.. హీరోయిన్లతో రొమాన్సులు.. పాటలు.. డ్యాన్సులు ఉండాల్సిందే అనే అభిప్రాయం ఒకప్పుడు…

3 hours ago

దేశం విడిచి వెళ్లిపో… అమీర్ ఖాన్ మేనల్లుడికి ఆదేశాలు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలో పాల్గొన్న ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు…

3 hours ago

ముత్తువేల్ పాండియన్ మళ్ళీ మొదలెట్టాడా

ఇవాళ జైలర్ 2 భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. మాములుగా బ్లాక్ బస్టర్ సీక్వెల్ కుండే హైప్ దీనికి పూర్తి…

4 hours ago