జనవరి 21.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పుట్టిన రోజు. మామూలుగా అయితే అతను ఈపాటికి అభిమానులతో, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జన్మదిన వేడుకలు చేసుకోవాల్సింది. కానీ అభిమానులకు కన్నీళ్లు మిగిల్చి.. పుట్టిన రోజు నాడు అతడి జ్ఞాపకాలను తలుచుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేసుకునేలా చేుశాడు.
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి అడుగు పెట్టి కై పో చే, శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎం.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ లవ్ స్టోరీ, చిచ్చోరే లాంటి సినిమాలతో అంచెలంచెలుగా ఎదిగి ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ యువ నటుడు.. ఇంత మంచి కెరీర్‌ను వదులుకుని, ఇంత త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడని ఎవరూ అనుకోలేదు. గత ఏడాది జూన్ 14న అతను ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులతో పాటు కోట్లాది మంది అభిమానులను విషాదంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
సుశాంత్ ఎందుకు చనిపోయాడనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ముందు అతడిని అనుమానాస్పద మృతిగానే భావించినప్పటికీ.. చివరికి పోలీసులేమో అది ఆత్మహత్యగానే నిర్ధరించారు. ఈ కేసు విచారణ అనేక మలుపులు తిరిగింది. కానీ కొత్త విషయాలేమీ వెలుగులోకి రాలేదు. ఎంత పెద్ద ఉదంతం జరిగినా కొంత కాలమే ఆ వేడి ఉంటుంది. ఆ తర్వాత అందరూ దాన్ని మరిచిపోతారు. సుశాంత్ వ్యవహారం కూడా అలాగే తయారైంది.
ఐతే ఈ రోజు సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద జనాల్లో ఎంత అభిమానం ఉందన్నది సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. ‘సుశాంత్ డే’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి లక్షలాది మంది స్పందిస్తున్నారు. అతడి సినిమాల జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్ ఫొటోలు, వీడియోలు, వివిధ సందర్భాల్లో అతడి వ్యాఖ్యలు, డైరీలో రాసుకున్న మాటలు.. ఇవన్నీ ప్రస్తావిస్తూ హృద్యమైన పోస్టులు పెడుతున్నారు. సుశాంత్ అభిమానులకు ఇవి చూస్తే కన్నీళ్లు ఆగట్లేదు. సుశాంత్ ఎందుకిలా చేశాడో అని మరోసారి మథనపడుతున్నారు.
This post was last modified on January 21, 2021 4:12 pm
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువతకు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ చేసిన సూచన ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉద్యోగం…
ఈ రోజుల్లో మంచి పని చేయడం ఎంత ముఖ్యమో...ఆ పనిపై జరిగే విషప్రచారాన్ని ఖండించడం కూడా అంతే ముఖ్యం. మరీ…
రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలామందికి అలవాటుగా మారిపోయింది. గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా మొబైల్ స్క్రీన్…
సరిగ్గా ఇంకో పదకొండు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల కానుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి మూడు వందల…
ముంబైలోని గోరేగావ్‌లో పబ్లిక్ టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు యువకులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చనిపోవడంతో అసలు లోపల…
చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…