రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో తెగ తిరిగింది. సెకండాఫ్ విషయంలో బన్నీ సంతృప్తికరంగా లేకపోవడం వల్ల మనసు మార్చుకున్నాడనే దిశగా సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి. వాటిని కొట్టిపారేసేలా లోకేష్ ఇవాళ ఒక ఫోటోని విడుదల చేశాక అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఏఏ 23 ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా తెరకెక్కుతోందని తెలిసి సంతోష పడ్డారు.

ఇక్కడ బన్నీ రెస్పాన్స్, ప్లానింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తనకు, తన సినిమాలకు, ఫ్యాన్స్ కు సంబంధించిన ఏ విషయమైనా సరైన సమయంలో స్పందన వచ్చేలా చేయడంలో అందరికంటే ముందు ఉన్నాడు. దగ్గర్లో రిలీజ్ లేకపోయినా మొన్నామధ్య వందల కొద్ది అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అందరికీ ఫోటోలు ఇచ్చాడు. ప్రతి రాష్ట్రంలో తన అసోసియేషన్ల పనితనం గురించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరంతరం న్యూస్ ఉండేలా చూసుకుంటున్నాడు.

మాములుగా చాలా మంది స్టార్ హీరోల గాసిప్స్ వచ్చినప్పుడు కనీస స్థాయిలో స్పందించడం కూడా మానేశారు. ఎక్కడ రెస్పాన్స్ ఇస్తే అది తప్పులా అర్థం చేసుకుంటారోనని మౌనాన్ని ఆశ్రయిస్తారు. కానీ అల్లు అర్జున్ అలా కాదు. యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ విషయంలో అందరికంటే ముందు ఉంటున్నాడు. మన దేశంలో క్రేజ్ తగ్గిపోయిన గిన్నిస్ బుక్ లో రాకాకు చోటు దక్కితే దాన్ని అందరూ మాట్లాడుకునేలా చేయడం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన ప్రత్యేక విషయమే.

సో రాకా తర్వాత లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు వంద శాతం ఉన్నట్టేనని క్లారిటీ వచ్చేసింది. కాకపోతే వీటి రిలీజులు ఎప్పుడు ఉంటాయనేది మాత్రం ఇప్పట్లో తేలేలా లేదు. వచ్చే ఏడాది రాకా రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. వారణాసి, స్పిరిట్ లను ఛాలెంజ్ చేసే కంటెంట్ ఇందులో ఉందని వాళ్ళ బలమైన నమ్మకం. పైగా అల్లు అర్జున్ మొదటిసారి ఇంత పెద్ద ఫాంటసీ డ్రామాలో నటిస్తున్నాడు. అది కూడా అంతర్జాతీయ సాంకేతిక బృందంతో. సో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి.