ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ 30 లాక్ అయ్యింది. అయితే సితార సంస్థ ప్రస్తుతం జైలర్ 2 పంపిణి వ్యవహారాల్లో బిజీగా ఉంది. పైగా రణబాలి కూడా మరుసటి రోజే ఉంది. ఈ రెండూ థియేటర్లకు వచ్చిన తర్వాత ఏకే 47 ప్రమోషన్లు మొదలుపెట్టే ఆలోచనలో నాగవంశీ ఉన్నారని తెలిసింది. ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చింది.

అంతర్గత సమాచారం ప్రకారం ఆదర్శ కుటుంబం ఈ నెలాఖరు రావడం కూడా అనుమానమేనట. కొత్తగా నవంబర్ 20 వైపు చూస్తున్నట్టు తెలిసింది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ టాక్స్ అయితే జోరుగా ఉన్నాయని తెలిసింది. ఆదర్శ కుటుంబం కోసమే నెల రోజులు వాయిదా పడిన ఇట్లు అర్జున చాలా ప్లాన్డ్ గా అక్టోబర్ 30 తీసుకుంది. ఇప్పుడు హఠాత్తుగా వెంకీ మామ వస్తే వాళ్లకు ఇంకో మంచి డేట్ దొరకదు. అందులోనూ దీపావళికి విపరీతమైన కాంపిటీషన్ స్వాగతం చెబుతోంది.

తమన్ రీ రికార్డింగ్ తో సహా ఇప్పటికైతే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వెంకటేష్ జనవరి 12 విడుదల షూటింగ్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసి అందులో బిజీగా ఉన్నారు. ఆదర్శ కుటుంబం పోస్ట్ ప్రొడక్షన్ చూసుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద చాలా ఒత్తిడి ఉంది. ఇలా జరగడం కొత్తేమి కాదు కానీ బాక్సాఫీస్ వద్ద ఏర్పడిన పరిస్థితులు ఈసారి భిన్నంగా ఉన్నాయి. అనిల్ రావిపూడి పట్టుదలగా లేకపోతే అసలు ఆదర్శ కుటుంబమే సంక్రాంతికి వదిలేవాళ్ళేమో.

క్లారిటీ రావాలంటే ఇంకో వారం రోజులకు పైగానే ఆగాలి. అప్పుడు కానీ స్పష్టత రాదు. పంపిణీదారులు ఆఫ్ ది రికార్డు చెప్పారు కానీ ఇంకా అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ మీడియా దగ్గర కూడా లేదు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఆదర్శ కుటుంబంలో నివేత పేతురాజ్ కీలక పాత్ర పోషించగా డింపుల్ హయతి స్పెషల్ సాంగ్ చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా నవ్వులతో గడిచి, సెకండాఫ్ లో పూర్తిగా యాక్షన్ మలుపు తీసుకునే కొత్త తరహా ట్రీట్ మెంట్ ఈ సినిమాలో చూడొచ్చట.