తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున చేర్చుకునే విషయంలో.. సేవా కార్యక్రమాలు చేయడంలో సూర్య గొప్ప పేరే సంపాదించాడు. అతను పక్కా ఫ్యామిలీ మ్యాన్ అనే సంగతి కూడా తెలిసిందే. నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య.. ఆమె పట్ల ఎంత ప్రేమతో, బాధ్యతతో ఉంటాడో ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది.
కొన్నేళ్ల విరామం తర్వాత జ్యోతిక మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటేనే సొంత బేనర్లో సినిమాలు తీసి ప్రోత్సహించాడు. ఇటీవల తమ పెళ్లి జరిగి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మళ్లీ ఆమెను పెళ్లాడి వార్తల్లో నిలిచాడు సూర్య. ఈ సందర్భంగా జ్యోతికను చూస్తూ సూర్య ఎమోషనల్ అయిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. పెళ్లయిన 20 ఏళ్ల తర్వాత కూడా భార్య మీద ఇంత ప్రేమ చూపించడం విశేషమే.
సూర్య మంచి భర్త మాత్రమే కాదు.. గొప్ప తండ్రి కూడా అని సర్టిఫికెట్ ఇస్తోంది జ్యోతిక. ఈ జంటకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. వాళ్లకు చదువుకు సంబంధించిన వ్యవహారాలన్నీ సూర్య స్వయంగా చూసుకుంటాడని ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక వెల్లడించింది. తమ పిల్లలిద్దరూ ముంబయిలో చదువుతుండగా.. వాళ్ల చదువు విషయాలు తాను పెద్దగా పట్టించుకోనని చెప్పింది.
తమ పిల్లలు చదివే స్కూల్ నుంచి చదువు, స్పోర్ట్స్, మిగతా యాక్టివిటీస్‌కు సంబంధించి రోజూ రెండు మెయిల్స్ వస్తాయని.. వాటిని చదివి రిప్లై ఇవ్వడం.. పిల్లల చదువు గురించి ఫాలో అప్ చేయడం.. పేరెంట్ మీటింగ్స్‌కు వెళ్లడం.. ఇవన్నీ సూర్యనే చూసుకుంటాడని జ్యోతిక వెల్లడించింది. ఇద్దరు పిల్లల్లో కూతురు సూర్య ఫేవరెట్ అని.. కొడుకు తమ ఇద్దరితోనూ బాగా కనెక్ట్ అవుతాడని జ్యోతిక చెప్పింది. అంత పెద్ద స్టార్ అయి ఉండి, ఎప్పుడూ బిజీగా ఉంటూ కూడా పిల్లల విషయంలో సూర్య తన బాధ్యతలను విస్మరించకపోవడం విశేషమే.
This post was last modified on October 11, 2026 3:08 pm
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా కబురు వచ్చేసింది. కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నట్లే విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు అనుమతులు ఆలస్యమవుతున్నాయని ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత వ్యాపారవేత్తల కారణంగానే తమ…
ఏపీ మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్ విధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ మంత్రివర్గం..…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…