మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్ యునానిమస్ గా రాకపోయినా శ్రీవిష్ణు నిరాశపరచలేదు. సత్యతో కలిసి బాగానే నవ్వించాడనే టాక్ బయటికి రావడంతో టికెట్లు తెగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సెంటర్స్ లో కళ్యాణ్ దూకుడు బాగుంది. మొదటి రోజు కంటే శని ఆదివారాల కలెక్షన్లు ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
చాలా రకాలుగా కామ్రేడ్ కళ్యాణ్ నక్కతోక తొక్కాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే డేట్ కి రావాలనుకున్న ఆదర్శ కుటుంబం ఏకే 47 వాయిదా పడింది. ఒకవేళ వెంకటేష్ కనక బరిలో ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్ట్ ఛాయస్ తనే అయ్యేవాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. పైగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం, తమన్ సంగీతం, కమర్షియల్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ కూడిన కంటెంట్ వెరసి శ్రీవిష్ణుకి ఈ కాంపిటీషన్ ఎదురుకోవడం ఈజీగా ఉండేది కాదు. అయితే శ్రీవిష్ణు అదృష్టం బాగుంది.
కాంపిటీషన్ లేకపోవడం వల్ల ఫీల్డర్స్ లేకుండా బౌండరీలు కొట్టే ఛాన్స్ దక్కింది. బాలీవుడ్ లో నాలుగు వందల కోట్లు దాటేసిన హనుమాన్ అంశ్ చాలా ఆలస్యంగా యాభై రోజుల తర్వాత తెలుగు డబ్బింగ్ రిలీజ్ కావడంతో బయ్యర్లు ఆశించినంత భారీ స్థాయిలో అంకెలు కనిపించడం లేదు. ఇప్పటికే అధిక శాతం హిందీ వెర్షన్ చూశారని, లేట్ కావడం, నీమ్ కరోలి బాబా మీద మనోళ్లకు అవగాహన లేకపోవడం లాంటి కారణాలు హనుమాన్ అంశ్ దూకుడుకి అడ్డం నిలిచాయి.
సో ఎలా చూసుకున్నా అక్టోబర్ 14 దాకా కామ్రేడ్ కళ్యాణ్ కు క్రికెట్ భాషలో చెప్పాలంటే అన్ని ఫ్రీ హిట్ నో బాల్స్ పడబోతున్నాయి. వాటిని బౌండరీ దాటిస్తాడా లేదానేది దర్శక నిర్మాతల చేతుల్లో ఉంది. ఇప్పటికైతే ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్లలో ప్రమోషన్లు కొనసాగించబోతున్నారు. ఇది ఎంతో కొంత బూస్ట్ ఇస్తే వీకెండ్ వసూళ్లు స్టడీగా ఉంటాయి. పిల్లల దసరా సెలవులు మొదలైన నేపథ్యంలో ఈ హాలిడే సీజన్ లో ప్రతి షో చాలా విలువైంది. పిండుకున్నోళ్లకు పిండుకున్నంత.
ఇప్పుడు ఎలా ఉన్నా అక్టోబర్ 15 నుంచి అసలు ఆట మొదలవుతుంది. జైలర్ 2, రణబాలి లాంటి భారీ సినిమాలతో పాటు గరివిడి లక్ష్మి లాంటి చిన్న మూవీ రేసులో ఉండటం ఆసక్తి రేపుతోంది. ఆలోగా కామ్రేడ్ కళ్యాణ్ వీలైనంత లాగేయాలి. అప్పటికంతా థియేటర్ కౌంట్ తగ్గిపోయి జనాలకు ఆప్షన్లు పెరుగుతాయి కాబట్టి కొత్త సినిమాల వైపు చూడటం మొదలుపెడతారు. చూస్తుంటే మృత్యుంజయ్, విష్ణు విన్యాసం ఫలితాల నుంచి కింగ్ అఫ్ ఎంటర్ టైన్మెంట్ శ్రీవిష్ణుకి రిలీఫ్ దక్కేలా ఉంది.
This post was last modified on October 11, 2026 11:44 am
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…