టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత మాత్రం బాగా వెనుకబడి పోయాడు. అనిరుధ్ రవిచందర్ భీభత్సమైన ఫామ్ లో లేకపోయినా ఆయా షేర్ లాంటి ఒకటి రెండు పాటలతో తన ఉనికిని చాటుకుంటూ ఉన్నాడు. తమన్ నుంచి ఆ స్థాయి కంపోజింగ్స్ ఆశిస్తున్నారు సంగీత ప్రియులు. లెనిన్, కొరియన్ కనకరాజు హిట్టే కానీ అవి కూడా పూర్తిగా సంతృప్తి పరిచిన ఆల్బమ్స్ కాదు. ఈ నెలాఖరు తమన్ కు చాలా కీలకం కానుంది.
అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆదర్శ కుటుంబం ఏకె 47 అక్టోబర్ 30 రావడం దాదాపు ఖరారే.. డిస్ట్రిబ్యూటర్ వర్గాలకు ఆల్రెడీ సమాచారం వెళ్ళిపోయిందట. కానీ మీడియాకు, ప్రేక్షకులకు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. తొందరపడకూడదనే ఉద్దేశంతో నిర్మాత నాగవంశీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం తమన్ దీని రీ రికార్డింగ్ పనుల్లో ఉన్నారు. రెగ్యులర్ ఫ్యామిలీ మూవీ కాకపోవడంతో బిజిఎం పరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్.
ఇది కాకుండా అక్టోబర్ 30 వస్తున్న మరో సినిమా ఇట్లు అర్జున. కొత్త హీరో అయినా దీనికి ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఎక్కడ సాంగ్ లాంచ్ జరిగినా తమన్ అక్కడికి వెళ్ళిపోయి స్పెషల్ గా ప్రమోషన్ చేస్తున్నాడు. అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ సినిమా చూశాక అవన్నీ మారిపోతాయని హీరో అనీష్, దర్శకుడు మహేష్ ఉప్పల ధీమాగా ఉన్నారు. వెంకీ కుడుములు నిర్మాతగా దీనికున్న ప్రధాన ప్లస్ పాయింట్. సాంగ్స్ రెస్పాన్స్ చూస్తుంటే స్లో పాయిజన్ తరహాలో ఎక్కేలా ఉన్నాయి.
ఇక నెగటివిటీ విషయానికి వస్తే ఆదర్శ కుటుంబంకి తమన్ ఒక సెంటిమెంట్ దాటాలి. వెంకటేష్ కు తాను ఇప్పటిదాకా పని చేసిన వాటిలో బాడీ గార్డ్, మసాలా, షాడో, వెంకీ మామ ఏవీ పెద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు. చివరిది మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. మిగిలిన మూడు ఫలితాలు అంతంత మాత్రమే. ఇప్పుడా బాకీని తమన్ తీర్చుకోవాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ రెండూ బెస్ట్ ఇవ్వాలి. అప్పుడు కెరీర్ లో ఫ్యాన్స్ ఫీలవుతున్న ముఖ్యమైన లోట్లలో ఒకటి తీరిపోతుంది.
This post was last modified on October 9, 2026 10:01 am
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…