పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం ఏకె 47 థియేటర్లకు వచ్చి మహా సందడిగా ఉండేది. వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి కాంబో కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూశారో తెలిసిందే. అయితే పనులు చాలా పెండింగ్ లో ఉండిపోవడం వల్ల వాయిదా పడింది. ఒకరి శాపం ఇంకొకరికి వరంగా మారినట్టు శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ కి కాంపిటీషన్ లేని గ్రౌండ్ దొరికింది.
జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ టాలీవుడ్ విజయదశమి సిరీస్ గా వస్తున్న వాటిలో మొదటిది. తర్వాత రాబోయే జైలర్ 2, రణబాలికు మంచి జోష్ ఇవ్వాలంటే కామ్రేడ్ కళ్యాణ్ హిట్ అవ్వడం అవసరం. రేపటి నుంచి ఏపీ తెలంగాణ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. రెండు వారాలు హాలిడేస్ అంటే చిన్న విషయం కాదు. సరైన కంటెంట్ ఇస్తే టికెట్ కౌంటర్లు కళకళలాడతాయి. బ్లాక్ బస్టర్ పడితే సంక్రాంతి రేంజ్ లో వసూళ్లు ఊహించుకోవచ్చు.
నక్సల్స్ కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ కామెడీ ప్రధానంగా కామ్రేడ్ కళ్యాణ్ రూపొందింది. రాత్రి హైదరాబాద్ లో వేసిన పరిమిత ప్రీమియర్ల నుంచి టాక్ బాగానే వినిపిస్తోంది. కామన్ పబ్లిక్ నుంచి కూడా ఇదే వినిపిస్తే బొమ్మకు హిట్టు స్టాంప్ పడుతుంది. మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రూపంలో రెండు షాకులు తిన్న శ్రీవిష్ణు ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించిన కోన వెంకట్ ప్రచార బాధ్యతలు కూడా దగ్గరుండి చూసుకుని బజ్ వచ్చేలా చేశారు.
క్యాస్టింగ్ పరంగా చూసుకుంటే సీనియర్ నటి రాధిక, సాయిచంద్ తో పాటు కమెడియన్లు సత్య, సుదర్శన్ లాంటి వాళ్ళతో తారాగణం బలంగానే ఉంది. జూన్ నుంచి పూర్తిగా నవ్వించిన సినిమా రాలేదు. పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, ప్యారడైజ్ మొదలైనవి అన్నీ సీరియస్ బ్యాక్ డ్రాప్సే. సో కామ్రేడ్ కనెక్ట్ అయితే మంచి నెంబర్లు చూడొచ్చు. అయితే కాంపిటీషన్ గా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హనుమాన్ అంశ్ డబ్బింగ్ ఉంది. అయినా సరే శ్రీవిష్ణు టీమ్ టెన్షన్ పడటం లేదు. .
This post was last modified on October 9, 2026 9:58 am
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…
అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…