ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడడం బండ్లన్న నైజం. పవన్ కల్యాణ్ భక్తుడైన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేతకు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరి ఆది దంపతులతో సమానం. ఇదే విషయాన్ని ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా బండ్లన్న చెప్పారు. అంతేకాకుండా, మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని పట్టించుకుంటే ముందుకు సాగలేమని, పక్కోడు తిట్టినా..ఏడ్చినా…మనం పైకి వెళ్లడంపైనే ఫోకస్ చేయాలని అదే వేదికపై మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు.
ఇక, పరిపాలించేవాడు ఎంత గొప్పవాడైనా…పక్కన ఉండేవాళ్లు నిజాయితీగా లేకుంటే ఆ పరిపాలన నిలబడదు అంటూ బండ్లన్న రెండ్రోజుల క్రితం తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు, నాయకుడి గొప్పతనం కాదు…ఆ నాయకుడి పక్కన ఉన్నవాళ్ల నిజాయితీనే అతని నిజమైన బలం అని గ్రేట్ కొటేషన్ ఒకటి చెప్పారు. ఆ క్రమంలోనే బండ్లన్నపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. బండ్లన్న ఎమ్మెల్సీ పదవి ఆశించారని, కానీ, అది దక్కకపోవడంతో ఫ్రస్ట్రేషన్ లో వేదాంతం చెబుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా తన ఎక్స్ ఖాతాలో బండ్ల గణేష్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. టైమ్‌పాస్ కోసం తన పేరు వాడి తన జీవితానికి అన్యాయం చేయొద్దని చేతులెత్తి నమస్కరించారు బండ్లన్న. అంతేకాదు, తనకు ఎటువంటి పదవుల మీద, హోదాల మీద ఆశ, వ్యామోహం లేదని క్లారిటీనిచ్చారు. పరిస్థితిని దయచేసి అర్థం చేసుకోవాలని, లేనిపోని విషయాలు మాట్లాడి తన పేరును వాడి తనకు ఇబ్బందులు కలిగించొద్దని రిక్వెస్ట్ చేశారు. దీంతో, తమ కామెంట్లతో బండ్ల గణేష్ హర్ట్ అయ్యారా? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా, ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దని చెప్పిన బండ్లన్న ఇలా సోషల్ మీడియాలో కామెంట్లకు హర్టయితే ఎలా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates