ఎన్టీఆర్ కి సీక్రెట్ సర్ప్రైజ్!

చరణ్ బర్త్ డేకి స్పెషల్ ప్రోమో విడుదల చేసిన ఆర్.ఆర్.ఆర్. టీం అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజున కూడా ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నారు. అయితే లాక్ డౌన్ వల్ల ఆ వీడియో చేయలేమని రాజమౌళి ఇంటర్వ్యూలలో చెప్పాడు. చరణ్ వీడియో లాక్ డౌన్ ముందే లాక్ అవడం వల్ల విడుదల చేయగలిగారు.

కానీ ఎన్టీఆర్ వీడియో కోసం ఆలా ప్రోమో స్టఫ్ లేదట. అయితే అభిమానులు ఆశిస్తారని, ఏమీ చెయ్యకపోతే నొచ్చుకుంటారని రాజమౌళికి బాగా తెలుసు. అందుకే సీక్రెట్ గా ఒక ప్రోమో కట్ చేస్తున్నారని, లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు రావడం వల్ల టీం కలిసి ఎడిటింగ్ సూట్ లో వర్క్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ వీడియో గురించి గోప్యంగా ఉంచుతున్నారు. సినిమా రేంజ్ కి తగ్గట్టు ఉందనిపిస్తే రిలీజ్ చేస్తారు లేదా భీమ్ షాట్స్ తో కూడిన చిన్నబర్త్ డే ప్రోమో వదిలేస్తారని చెప్పుకుంటున్నారు. ఏ సంగతీ మరో వారం, పది రోజుల్లో క్లారిటీ రావచ్చు.