Movie News

ప్యారడైజ్… తెలంగాణలో ఒక పండగ మాదిరి

సినిమా అనేది యూనివర్శల్ అయినా.. లోకల్‌గా జనాలకు కనెక్ట్ అయ్యే కథాంశాలను ఎంచుకోవడం, ఆయా ప్రాంతాల వారికి కనెక్ట్ అయ్యేలా ప్రమోషన్లు చేయడం కూడా కీలకమే. ఒకప్పట్లా ఏదో ఒక భాషకు, ప్రాంతానికి పరిమితం కాకుండా వివిధ ప్రాంతాల సంస్కృతులను, భాష-యాసలను ఎక్స్‌ప్లోర్ చేసే ప్రయత్నం ఫిలిం మేకర్స్ ఇటీవల గట్టిగానే చేస్తున్నారు. ‘రంగస్థలం’ సినిమాను గోదావరి ప్రాంత నేపథ్యంలో తీసిన సుకుమార్.. తర్వాత చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో ‘పుష్ప’ తీశాడు.

ఇప్పుడు ఇంకో కొత్త బ్యాక్ డ్రాప్ ఏదో ఆయన ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుకుమార్ శిష్యుల్లో ఒకరైన శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమా ‘దసరా’లో తాను పుట్టి పెరిగిన తెలంగాణ ప్రాంత నేపథ్యంలోనే కథను తీర్చిదిద్దుకున్నాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’కు కూడా అదే బాటలో సాగుతున్నాడు. ఇది కూడా తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమానే. ప్రోమోలు చూస్తే స్పష్టంగా ఆ విషయం అర్థమైంది.
ఈ సినిమా ప్రమోషన్లు కూడా తెలంగాణ కల్చర్ చుట్టూనే తిరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే ‘ది ప్యారడైజ్’ను తెలంగాణలో రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ.. ఒక అదిరిపోయే ఐడియాతో రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లో తమ ఆధ్వర్యంలోని ఫేమస్ థియేటర్లు మైత్రి విమల్, మైత్రి గంగ థియేటర్లలో సరికొత్త ఇంటర్వల్ స్నాక్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో చాలా పాపులర్ అయిన, ఇక్కడి జనాలు ఎంతో ఇష్టపడే సర్వపిండి వంటకాన్ని ఈ సినిమా ఇంటర్వెల్స్‌లో అమ్మకానికి పెడుతున్నారు. తెలంగాణలో సర్వపిండి వంటకానికి పేరు పడ్డ ఇక లేడీ చెఫ్‌ను ఇందుకోసం రంగంలోకి దించారు.

ఈ విషయం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. తెలంగాణ నేపథ్యంలో ‘ది ప్యారడైజ్’ మేకర్స్ సినమా తీయడం ఒకెత్తయితే.. థియేటర్లలో ఎన్నడూ ఊహించిన విధంగా సర్వపిండిని సప్లై చేయడం అన్నది ఇంకో ఎత్తు. ఇది తెలంగాణ ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహానిస్తుందనడంలో సందేహం లేదు. ప్రమోషన్ల పరంగా ఇది మైత్రి వాళ్లు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. ఈ థియేటర్లకు జనాలను బాగా ఆకర్షించే ఎత్తుగడగా దీన్నిచెప్పొచ్చు.

This post was last modified on September 23, 2026 5:20 pm

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

4 hours ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

4 hours ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

6 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

6 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

7 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

7 hours ago