గుంటూరు జిల్లాలోని పొన్నూరు మునిసిపాలిటీ రాజకీయం అధికార టీడీపీకి అనుకూలంగా ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో ఈ స్థానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దాదాపు 32,915 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై ఘన విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం, మునిసిపాలిటీ పరిధిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బలంగా ఉంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వివిధ వార్డులు, స్థానిక అభివృద్ధి పనులపై పట్టు సాధించారు.
ఇటీవల పట్టణంలో రోడ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పన వంటి పనులపై దృష్టి పెట్టారు. దీనికితోడు కార్యకర్తలతోనూ కలివిడిగా ఉంటున్నారు. ఇక, వైసీపీ విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అంబటి మురళీకృష్ణ డోలాయమానంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు కష్టమన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట. అయితే.. అంబటి మాత్రం పార్టీ శ్రేణులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని కొన్ని గ్రామాలలో మొక్కజొన్న రైతుల పక్షాన గళం వినిపించారు.
క్షేత్రస్థాయిలో రాజకీయ బలాన్ని పెంచుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కొంతమంది స్థానిక నాయకులు పార్టీలు మారుతున్నారు. ఉదాహరణకు ఇటీవల టీడీపీకి చెందిన మండవ గౌతమ్ వంటి కొందరు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే.. ఈ విషయాన్ని టీడీపీ లైట్ తీసుకుంది. వచ్చే స్థానిక ఎన్నికల్లో పొన్నూరు మునిసిపాలిటీని దక్కించుకుని తీరుతామని ఎమ్మెల్యే ధూళిపాళ్ల చెబుతున్నారు. మరోవైపు.. తన వారసురాలిని అరంగేట్రం చేయించేందుకు కూడా చూస్తున్నారు.
ధూళిపాళ్ల వైదీప్తి.. ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే.. కొన్నాళ్ల కిందట జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరైన మంత్రి లోకేష్.. వైదీప్తికి ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. వచ్చే ఎన్నికల వరకు కాకుండా.. మునిసిపల్ ఎన్నికల్లో నే దీప్తిని రంగంలోకి దింపాలని ధూళిపాళ్ల నిర్ణయించుకున్నట్టు పొన్నూరులో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఏ క్షణమైన టీడీపీ కండువా కప్పుకోనున్నారని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం నరేంద్ర పోటీ చేస్తారని.. వైదీప్తి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొచ్చని.. మునిసిపల్ ఛైర్మన్ పోస్టుపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 19, 2026 8:12 am
నిన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ ఓపెనింగ్స్ డీసెంట్ గా మొదలయ్యాయి. ఉదయం కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ సాయంత్రానికి పరిస్థితిలో మార్పొచ్చింది.…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 మొదటి రోజు చెన్నై టికెట్ ధర కంటే ఆంధ్రప్రదేశ్ లోని ఒక…
ఒక ఇంట్లో దొంగ పడ్డాడు. నగలు, నట్రా దోచుకున్నాడు. యజమాని ... ఆ దొంగను గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.…
టీ20ల్లో 249 పరుగులు చేసినా గెలవలేకపోతే బౌలింగ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాకు అదే…
అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీలకు కొత్త సమస్య వచ్చిపడింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా ఎనిమిది…
తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి చేస్తున్న రాజకీయాలపై ఆసక్తికర…