Trends

వైష్ణవి సోదరుడే హత్య చేశాడు

ఆరు నెలల క్రితం హత్యకు గురైన ప్రముఖ యూ ట్యూబర్ వైషు అమ్మ ఫేమ్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు గురువారం మధ్యాహ్నం నిజమాబాద్ నగరంలో పట్ట పగలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య వైష్ణవి సోదరుడు సంతోష్ చేసినట్లు స్వయంగా అంగీకరించాడు. ఈ మేరకు అతడు వీడియో ఒకటి విడుదల చేశాడు. పోలీసుల ఎదుట లొంగిపోనున్నట్లు వెల్లడించాడు. దీంతో సెన్సేషన్ సృష్టించిన హరిబాబు మర్డర్ మిస్టరీ వీడిపోయింది.

పది నెలల క్రితం యూ ట్యూబర్ వైష్ణవి, హరిబాబు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొద్ది రోజులకే ఆమె గర్భం దాల్చింది. వైష్ణవి 4 నెలల గర్భవతిగా సమయంలో భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి. హరిబాబు కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని వైష్ణవి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చి 16 వ తేదీన భార్యా భర్తల మధ్య ఘర్షణ జరిగింది. విచక్షణ కోల్పోయిన హరిబాబు గర్భవతి అనికూడా చూడకుండా వైష్ణవిని కత్తితో పొడిచాడు. దాంతో ఆమె మరణించింది.

ఇది మనసులో పెట్టుకున్న వైష్ణవి అన్న సంతోష్ ఎలాగైనా సరే హరిబాబును అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం వేచి చూసాడు. వైష్ణవి హత్య కేసులో జైలుకు వెళ్లిన హరిబాబు బెయిల్ మీద విడుదలయ్యాడు. నిజామాబాద్ లోని ఇంద్ర పూర్ లో తల్లితో కలిసి ఉంటున్నాడు. రాజ రాజేంద్ర నగర్ చౌరస్తా ప్రాంతంలో మక్క బుట్టలు విక్రయిస్తున్నాడు. మధ్యాహ్నం ఎండకు దాహం వేయడంతో నీళ్లు తాగేందుకు దగ్గరగా వున్న చాట్ బండి వద్దకు వెళ్ళాడు.

అప్పటికే కారులో నుంచి కాపు కాస్తున్న సంతోష్ ఇదే అదనుగా దాడికి పాల్పడ్డాడు. కారులోంచి ఒక్కసారిగా దూకి పరుగు మీద వచ్చిన సంతోష్ కొబ్బరి బొండాల కత్తితో హరిబాబు తలపై నరికాడు. కేవలం 10 సెకన్లలో తొమ్మిది సార్లు కత్తితో నరికినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . అయితే పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ హత్య చేసినట్లు స్థానికులు భావించారు. కానీ వైష్ణవి కుటుంబ సభ్యుల పనే అయ్యుంటుందని పోలీసులు అంచనా వేశారు. చివరికి పోలీసుల అంచనా నిజమైంది. స్వయంగా హంతకుడే వీడియో రిలీజ్ చేసి నేరం అంగీకరించాడు.

ఈ హత్య తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. మూడు రోజుల క్రితం సెప్టెంబర్ 14 వ తేదీన హైదరాబాద్ నాగోల్ పరిధిలో ఇలాగే ఓ హత్య జరిగింది. భూ వివాదాల నేపథ్యంలో క్లోజ్ ఫ్రెండ్ నే హత్య చేసాడో రౌడీ షీటర్. వెంటాడి వెంటాడి హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరవక ముందే నిజామాబాద్ లో హరిబాబు హత్య జరగడంతో తెలంగాణాలో చర్చనీయాంశంగా మారింది. వరస హత్యలతో పోలీసుల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

This post was last modified on September 18, 2026 6:39 am

Share

Recent Posts

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

2 hours ago

విశ్వక్ సేన్ నిర్ణయం ఎటువైపు ఉంటుందో

ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…

4 hours ago

శ్రీవిష్ణు సినిమాకు అదొక్కటే సవాల్

ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…

4 hours ago

రాజుగారికి రాములోరి అభయం దక్కుతుందా

యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…

5 hours ago

అగ్గిపెట్టి మ‌చ్చా ఇక లేడు

అగ్గిపెట్టి మ‌చ్చా.. సోష‌ల్ మీడియా వాడే తెలుగు వాళ్ల‌కు ప్ర‌త్యేకంగా ఈ పేరును ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డి…

7 hours ago

ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…

7 hours ago