Movie News

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల టాక్. 2027 సంక్రాంతి విడుదల టార్గెట్ చేసుకుని జనవరి 13 డేట్ కూడా ప్రకటించిన ‘కాకా’ని దానికి తగ్గట్టే దర్శకుడు బాబీ కొల్లి శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. మెగాస్టార్ సహకారం పూర్తిగా ఉండటంతో ఎక్కడా బ్రేకులు పడటం లేదు. వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేయాలనే సంకల్పంతో ఈ టీమ్ అలుపు లేకుండా కష్టపడుతోంది.

ఇక్కడే ఒక సమస్య వచ్చిందట. రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం వెయిటింగ్ లో ఉన్న ‘విశ్వంభర’ని పండక్కు విడుదల చేస్తే బాగుంటుందనే దిశగా చర్చలు మొదలయ్యాయట. అలా అయితే మంచి ఓటిటి డీల్ దక్కుతుందని వినికిడి. కానీ బాబీ దీనికి ససేమిరా అనొచ్చు. ఎందుకంటే తన టార్గెట్ పట్ల చాలా క్లారిటీతో ఉన్నాడు. కాకాని శిల్పంలా చెక్కుతున్నా సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో సర్వం సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడీ ట్విస్టు రావడం ఎవరూ ఊహించలేదు.

ఎలాగూ జరిగే ఆలస్యం జరిగిపోయింది కాబట్టి విశ్వంభరని 2027 వేసవికి తీసుకెళ్లినా నష్టం లేదనే కోణంలో ఆర్గుమెంట్ జరుగుతోందిట. అలా అయితే దాని ఓటిటి ఏ జూలైలోనూ ఆగస్ట్ లోనో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సదరు డిజిటల్ కంపెనీ ఒప్పుకోకపోవచ్చు. ఇప్పుడు బంతి చిరంజీవి కోర్టులో ఉంది. ఆయన మాటే ఫైనల్ కాని బాబీ కష్టాన్ని కళ్లారా చూస్తూ కఠినమైన నిర్ణయం తీసుకుంటారానే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరగా ఇది తేలాలి.

ఇదంతా బాగానే ఉంది కానీ విశ్వంభర లాంటి విజువల్ గ్రాండియర్ కి కంటెంట్ పరంగా పోటీ ఉండకూడదు. కానీ ప్రశాంత్ వర్మ నిర్మాణంలో రూపొందిన మహాకాళి ఇదే జానర్ లో వస్తోంది. అందరి కంటే ముందు జనవరి 8 ఆల్రెడీ వేసుకున్నారు కూడా. సో పోలికలు లాంటివి వచ్చే అవకాశాలు లేకపోలేదు. రెండింటి స్థాయి ఒకటే కాకపోయినా కంటెంట్ మాట్లాడే రోజుల్లో కంపారిజన్లు తప్పడం లేదు. చూడాలి మరి పండక్కు కాకా వస్తాడో లేక విశ్వంభర సై అంటాడో వెయిట్ అండ్ సీ.

This post was last modified on September 12, 2026 10:37 am

Share

Recent Posts

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

2 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

3 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

3 hours ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

3 hours ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

4 hours ago