నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో వెళ్లిపోయింది. రెండో పాట ‘యేషనాగుల కట్ట’ రిలీజ్ కావడానికి ముందే పెద్ద హిట్ కాబోతోందన్నది నిర్ణయం అయిపోయింది. ఆ పేరుతో ఉన్న ఫోక్ సాంగ్ ఆల్రెడీ పాపులర్ కాగా.. అనిరుధ్ తనదైన శైలిలో ఆ పాటను ట్యూన్ చేయడం.. లిరిక్స్, సింగింగ్ కూడా బాగా కుదరడంతో ఆ పాట అంచనాలకు తగ్గట్లే వచ్చింది.
కానీ అన్నీ బాగున్నా.. ఈ పాట విజువల్స్ మాత్రం ప్రేక్షకులను ఒకింత నిరాశకు గురి చేశాయి. పాటలో ఉన్నంత ఊపు డ్యాన్స్‌లో లేదనే కామెంట్లు సర్వత్రా వినిపించాయి. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో హుక్ స్టెప్‌తో ఆకట్టుకున్న ఆట సందీప్.. ఈ పాటకు న్యాయం చేసే స్టెప్స్ వేయించలేదన్నది ప్రధాన కంప్లైంట్. సోషల్ మీడియాలో అతను బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నాడు.
ఐతే ఇప్పుడు సందీప్‌కు ‘ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నుంచి గట్టి మద్దతు లభించింది. ఆట సందీప్ ‘యేషనాగుల కట్ట’కు స్లో స్టెప్స్ వేయించడంలో అతడి తప్పేమీ లేదన్నట్లు మాట్లాడాడు శ్రీకాంత్. ఆ పాటకు అలాంటి డ్యాన్స్ ఉండాలన్నది తన నిర్ణయమే అని శ్రీకాంత్ స్పష్టం చేశాడు.
‘‘ఆ పాట అలా ఉండాలన్నది నా కాలే. డ్యాన్స్ స్లోగా ఉండాలి. ఓ ఎగరద్దు ఇష్టమొచ్చినట్లు. స్టేజ్ బద్దలైపోయేలాగా స్టెప్స్ ఉండకూడదు. మామూలుగా మన పెళ్లిళ్లలో, బారత్‌ల్లో తాగేసి సింపుల్‌గా ఎగురుతుంటారు కదా. అలా ఉండాలి స్టెప్స్ అనేది నా ఉద్దేశం. ముందు ఈ స్టెప్స్‌కు మీద కొంచెం విమర్శలు వస్తాయి. తర్వాత అంతా సెటిలైపోతుంది అన్నది నేను ఊహించా. నేను అనుకున్నట్లే ఇప్పుడు అందరూ పాట విషయంలో పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. పాట జనాల్లోకి బాగా వెళ్లిపోయింది’’ అని శ్రీకాంత్ ఓదెల చెప్పాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ‘ది ప్యారడైజ్’ టీం తమ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయబోతోంది. నాని సరసన కాయదు లోహర్ నటించిన ఈ సినిమాలో లెజెండరీ నటుడు మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు.
This post was last modified on September 12, 2026 11:20 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…