Movie News

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే ఇంకో ఆరు రోజుల్లో ఆదర్శ కుటుంబం ఏకే 47 విడుదల కానుంది. వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఇంత పెద్ద సినిమా వస్తుంటే అంతగా సౌండ్ వినిపించడం లేదనేది ప్రమోషన్స్ గురించి ఫ్యాన్స్ చేస్తున్న కంప్లయింట్. ఇంటర్వ్యూలు గట్రా వదిలినా కిక్ సరిపోవడం లేదు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ బాకీ ఉన్నాయి.

ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. తాను డీల్ చేసే హీరో ఎంత పెద్ద స్టార్ అయినా పబ్లిసిటీని తన క్రియేటివిటీతో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం గత కొన్నేళ్లుగా చూస్తున్నాం. నయనతారని అనౌన్స్ మెంట్ ప్రోమోకే ఒప్పించడం మన శంకరవరప్రసాద్ గారు టైంలో జరిగిన అతి పెద్ద వండర్. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ తో పాట పాడించిన సంగతిని ఒక వెరైటీ ప్రోమో ద్వారా జనాలు నవ్వుకుని మరీ అంగీకరించేలా చేయడం అనిల్ బుర్రకో మచ్చుతునక.

ఇలా ఒక పద్దతి ప్రకారం వారాలు నెలల ముందే ప్రమోషన్లను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ద్వారా సినిమాకు హైప్ పెంచడం అనేది రావిపూడి ఎప్పటి నుంచో పాటిస్తున్న ఫార్ములా. అయితే త్రివిక్రమ్ కు ఈ పద్దతి ఉండదు. వెనకాల ఉంటారు తప్పించి ముందుకొచ్చి హడావిడి చేయరు. అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ అయినప్పుడు, గుంటూరు కారం అంచనాలు అందుకోలేనప్పుడు ఒకేలా ఉన్నారు. ఇది కొన్నిసార్లు ప్లస్ అనిపిస్తే కొన్నిసార్లు మైనస్ అవుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రమోషన్ల దూకుడు చాలా అవసరం. ఆదర్శ కుటుంబం ఎందుకు తక్కువ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోందనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఓపెనింగ్స్ పరంగా మాత్రం అభిమానులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర బాగా గ్యాప్ ఉంది. ప్యారడైజ్ నిరాశపరచడంతో మళ్ళీ పెద్ద సినిమా కోసం బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. దసరా కన్నా ముందే వస్తున్న ఆదర్శ కుటుంబం కనక టాక్ తెచ్చుకుంటే వసూళ్ల మోత ఖాయం.

This post was last modified on October 3, 2026 6:34 pm

Share

Recent Posts

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

1 hour ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

1 hour ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

1 hour ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

2 hours ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

3 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

3 hours ago