మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ ‘జై’తో హీరోగా పరిచయం అయిన అతడికి తొలి ప్రయత్నంలో సక్సెస్ దక్కపోయినా.. ఆ తర్వాత అవకాశాలకేమీ లోటు లేకపోయింది. కానీ వాటిని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. ‘గౌతమ్ ఎస్ఎస్‌సీ’ తప్పితే పెద్ద హిట్ పడలేదు.
అయినా క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేసుకుంటూ.. టీవీ షోల్లో మెరుస్తూ బండి నడిపిస్తూ ఉన్నాడు. తనను చూస్తే ఎంతో టాలెంట్ ఉండి ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఇండస్ట్రీలో అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడనిపిస్తుంది. ఐతే నవదీపే కాదు.. అతడి కుటుంబం కూడా మంచి అవకాశాన్ని మిస్సయిందని అంటున్నాడు సీనియర్ నటుడు అజయ్ ఘోష్.
ఆంధ్ర ప్రాంతానికి చెందిన నవదీప్ కుటుంబానికి ‘రామారావు రిసార్ట్’ పేరుతో మంచి బీచ్ రిసార్ట్ ఉండేదని ఒక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ ఘోష్ తెలిపాడు. అది నవదీప్ తండ్రి రామారావుదే అని.. ఐతే వీళ్ల కుటుంబం హైదరాబాద్‌కు వచ్చేటపుడు ఆ రిసార్ట్ అమ్మేసిందని.. ఆ రిసార్ట్ అలాగే ఉంచుకుని ఉంటే ఇప్పుడు వందల కోట్ల ప్రాపర్టీ అని అజయ్ ఘోష్ తెలిపాడు. ఇప్పుడు ఆ రిసార్ట్‌కు మంచి డిమాండ్ ఉందని అన్నాడు. నవదీప్‌ను చూసినపుడల్లా తనకు ఆ రిసార్ట్ గుర్తుకు వస్తుందని.. దాన్ని అలాగే ఉంచుకుంటే వాళ్ల ఫ్యామిలీ ఏ రేంజిలో ఉండేదో అనిపిస్తుందని అజయ్ తెలిపాడు.
నవదీప్ మావయ్య తన క్లాస్ మేటే అని.. వాళ్ల కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని అజయ్ ఘోష్ తెలిపాడు. ఐతే రియల్ ఎస్టేట్‌లో ఇలాంటి అద్భుతాలు జరగడం మామూలే. హైదరాబాద్‌లో చాలా తక్కువకు భూములు అమ్మేసిన వాళ్లు.. ఇప్పుడు వందల కోట్ల రేంజికి వెళ్లిన ఆ భూములను చూసి ఇలాగే ఫీలవుతుంటారు. రిసార్ట్ అమ్మేసిన నవదీప్ కుటుంబం.. హైదరాబాద్‌లో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే అదీ ఆ స్థాయిలోనే రిటర్న్స్ ఇస్తుండొచ్చు.
This post was last modified on October 3, 2026 5:46 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…