Movie News

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ, దర్శకుడు ఆదిత్య హాసన్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వయసైపోయిన వాళ్లకు ఇది నచ్చదని, జెన్ జీ బ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నారని ఒక విచిత్రమైన భాష్యం చెప్పారు. అయితే ఎక్స్, ఇన్స్ టాలో కామెంట్లు చేస్తున్నది యువతనే లాజిక్ మర్చిపోయారు. దీని సంగతి అలా ఉంచితే ఎపిక్ మీద ఇలాంటి స్పందన ఎందుకు వచ్చిందో చిన్న విశ్లేషణ చేద్దాం.

ఎపిక్ ముందు నుంచి 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ కొనసాగింపుగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. ప్రాజెక్ట్ లాంచ్ టైంలో వదిలిన టీజర్ చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో సహజంగానే ప్రేక్షకులు హోమ్లీ ఎంటర్ టైనర్ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ దానికి భిన్నంగా లివిన్ రిలేషన్స్, సెక్స్, అమ్మాయిల పీరియడ్స్ లాంటి అంశాలు పెట్టడంతో సహజంగానే అధిక శాతం ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు. పైగా ఎంటర్ టైన్మెంట్ తగ్గిపోయి ఓవర్ ఎమోషన్స్ డామినేట్ చేయడం మైనస్ అయ్యింది.

ఎంతసేపూ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య రూములో పదే పదే మాట్లాడుకోవడం, కలుసుకోవడం, ఆనంద్ ఇండియాలో ఉన్న స్నేహితుడు కళ్యాణ్ శంకర్ కు ఫోన్ చేయడం ఇలా ఒక సాగదీసిన ఫార్మాట్ గా కొంత మంది ఫీలవుతుండగా, ఒక జంట మధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మాత్రం సంఘర్షణ చూపించాలని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే ఈ శాతం తక్కువగా ఉండటం వల్లే బాక్సాఫీస్ దగ్గర నెంబర్లు నెమ్మదిగా కదులుతున్న మాటని అంగీకరించాలి.

ఇదింకా రెండో రోజే కాబట్టి ఎపిక్ ఫైనల్ గా ఎక్కడ నిలబడుతుందనేది పండగ అయ్యాక క్లారిటీ రావొచ్చు. అనూహ్యంగా అసలు పోటీనా అనుకున్న తమిళ డబ్బింగ్ మండాడి చాలా తక్కువ టైంలో తెలుగు రాష్ట్రాల్లో పికప్ చూపిస్తోంది. మహేంద్రగిరి వారాహి కూడా మిక్స్డ్ టాక్ తోనే పోరాడుతోంది. కమర్షియల్ లెక్కల కోసం తీయలేదని చెబుతున్న నాగవంశీ కోరుకున్నట్టు ఒకవేళ ఎపిక్ కనక వసూళ్ల కన్నా ఎక్కువ జనాల ప్రశంసలు దక్కించుకుంటే అది కూడా అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. చూడాలి మరి. 

This post was last modified on September 12, 2026 9:34 am

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

2 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

5 hours ago