Political News

వైసీపీకి బిగ్ షాక్… బొత్స మేనల్లుడు రాజీనామా

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. మునిగిపోయే టైటానిక్ వంటి వైసీపీ నుంచి బాలినేని, సాయిరెడ్డి, మోపిదేవి వంటి కీలక నేతలు దూకేశారు. నియోజకవర్గ స్థాయి నేతలు కూడా చాలామంది పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ ఇచ్చింది వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు చిన్న శ్రీను.

లోకల్ వార్ మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు ఉత్తరాంధ్రలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఆయన పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి, భీమిలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్‌, విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి కూడా వైదొలగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. బొత్స కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చిన్న శ్రీను పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు.

బొత్స కుటుంబానికి చెందిన నేత అయిన చిన్న శ్రీనుకు ఉత్తరాంధ్ర రాజకీయాలపై గట్టి పట్టుంది. ఆయన పార్టీని వీడడం…అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీకి తీరని నష్టం అని చెప్పవచ్చు. అయితే, ఆ రాజీనామాకు గల కారణాలను ఆయన వెల్లడించాల్సి ఉంది. చిన్న శ్రీను జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే, తన రాజకీయ భవిష్యత్ కార్యచరణ గురించి ఆయన స్పందించాల్సి ఉంది.

This post was last modified on September 8, 2026 8:10 pm

Share

Recent Posts

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

36 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

42 minutes ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago

బాబు.. ప‌వ‌న్‌.. జోడీకి జ‌నాలు ఫిధా!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, డిప్యూటీసీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల జోడీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ…

11 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

12 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

12 hours ago