ఒకప్పుడు తన సినిమాలకు బ్లాక్ టికెట్లు నడిచేంత మార్కెట్ ఎంజాయ్ చేసిన హీరో అల్లరి నరేష్. కామెడీ స్టార్ ట్యాగ్ తోనే ఈజీగా యాభై చిత్రాలు పూర్తి చేయడం తనకు మాత్రమే చెల్లింది. ఆ తర్వాత వరస ఫ్లాపులతో కొంత స్లో అయిపోయి బ్రేక్ తీసుకున్నా తిరిగి మునుపటి వేగానికి వచ్చేశాడు. ఇటీవలే విడుదలైన రంభ ఊర్వశి మేనకకు వీకెండ్ పికప్ బాగుంది. టాక్ ఎలా ఉన్నా అల్లరోడు ఏదో టైం పాస్ చేయించి పంపుతాడనే జనాల నమ్మకం టికెట్లు తెంపేందుకు దోహదపడుతోంది.
బుక్ మై షో చూస్తే ఇరవై నాలుగు గంటల్లో రంభ ఊర్వశి మేనకకు 16 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది రోమాంచకం కన్నా తక్కువ. అంతెందుకు పదిహేడో రోజులో ఉన్న ఇరుముడి కన్నా కూడా తక్కువే. అంటే టాక్ ప్రభావం రంభ ఊర్వశి మేనక మీద పడిందని చెప్పాలి. ఒకటి మాత్రం వాస్తవం. ఈ మాత్రం రెస్పాన్స్ వచ్చిందంటే అల్లరి నరేష్ ని ఇంకా హాస్య పాత్రల్లో రిసీవ్ చేసుకునేందుకు ఆడియన్స్ సిద్ధం ఉన్నారనే క్లారిటీ వచ్చేసినట్టే. కాకపోతే సరైన కంటెంట్ పడాలి.
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అల్లరి నరేష్ కి రంభ ఊర్వశి మేనక పూర్తి భరోసా ఇవ్వకపోయినా ప్రేక్షకుల్లో తన మీద ఉన్న గౌరవాన్ని చూపించింది. కానీ అది తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత అతని మీదే ఉంది. ఇంతకు ముందు ఆ ఒక్కటి అడక్కు అనే ఎంటర్ టైనర్ చేసి చేదు ఫలితం చూసిన అల్లరి నరేష్ టైటిల్ కి టెంప్టయ్యి ఒప్పుకున్నాడు తప్పించి స్క్రిప్ట్ ఎలా వచ్చిందో సరిగా చూసుకోలేదనే కామెంట్స్ అప్పట్లోనే ఓపెన్ గా వచ్చాయి.
ఇప్పుడు రంభ ఊర్వశి మేనక ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుందనే దాన్ని బట్టి రేంజ్ ఏంటనేది డిసైడ్ అవుతుంది. వీక్ డేస్ మొదలయ్యాయి కాబట్టి ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోతాయి. అవి మరీ తీవ్రంగా ఉంటే కష్టమే కానీ డీసెంట్ గా హోల్డ్ చేసుకుంటే మటుకు హమ్మయ్యా అనుకోవచ్చు. ఇకపై కూడా అల్లరి నరేష్ కామెడీ సినిమాలు చేయొచ్చు. కానీ కథా కథనాల విషయంలో తగినంత శ్రద్ధ వహించి సబ్జెక్ట్ సెలక్షన్ లో కనక జాగ్రత్తగా ఉంటే మంచి వైభవం చూడొచ్చు.
This post was last modified on September 7, 2026 10:48 am
ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…
ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…