తమిళనాట రాజకీయ పార్టీ పెట్టిన రెండున్నర సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు విజయ్. అతను ఎన్నికల్లో మంచి ప్రభావమే చూపిస్తాడని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు కానీ.. మరీ ఇలా ఏకంగా సీఎం అయిపోతాడని మాత్రం ఊహించలేదు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాక కొన్ని సంచలన నిర్ణయాలతో అతను వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. అసెంబ్లీలో కూడా విజయ్ ప్రసంగాలు, చర్యలు ఆకట్టుకునేలాగే సాగుతూ వచ్చాయి.
ఐతే ఇన్నాళ్లూ విజయ్ అసెంబ్లీలో చేసింది ఒకెత్తయితే.. సోమవారం చేసింది మరో ఎత్తు. మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర ఆవేశంతో, ప్రతిపక్ష డీఎంకేను ఉతికారేస్తూ సాగిన ఆయన ప్రసంగం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. డీఎంకే మీద ఇంతకుముందు కూడా విమర్శలు చేశాడు కానీ.. ఈసారి మాత్రం విజయ్ స్పీచ్‌లో ఫైర్ మామూలుగా లేదు. ముఖ్యంగా డీఎంకే అవినీతి మీద విజయ్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు.. ఆయన వేసిన పంచులు మామూలుగా పేలలేదు.
విజయ్ తన స్పీచ్‌లో లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ పేరును ప్రస్తావించడం విశేషం. ముందుగా 1967, 1977, 1982, 2026 సంవత్సరాలను పేర్కొన్న విజయ్.. తర్వాత అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్, విజయ్ పేర్లు ప్రస్తావించాడు. ఆయా సంవత్సరాల్లో బలమైన జననేతలు వచ్చారన్న అర్థంతో విజయ్ మాట్లాడాడు. విజయ్ వీరావేశంతో ఈ పేర్లు ప్రస్తావించినపుడు సభ హోరెత్తిపోయింది.
అలాగే గత ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉండేదో ఉదాహరణలతో ప్రస్తావించినపుడు కూడా తమిళనాడు అసెంబ్లీ హోరెత్తింది. అవినీతి సొమ్ము నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరేదంటూ అప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌లతో పాలు పలువురి పేర్లు ప్రస్తావించాడు. ‘కరూర్ గ్యాంగ్’ అంటూ మద్యం అవినీతి సొమ్మును కలెక్ట్ చేసిన కొందరు నేతల పేర్లను ప్రస్తావిస్తూ విజయ్ ఫైర్ అవడం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది.
This post was last modified on September 7, 2026 2:28 pm
కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…
సైబర్ నేరాల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వాలు సహా రిజర్వ్ బ్యాంకు…
చాలా ఏళ్ల నుంచి తమిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒకడు. సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత…
తెలంగాణలో కీలకమైన ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, డిప్యూటీసీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ల జోడీకి ప్రజల్లో మరింత ఆదరణ…
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…