Movie News

ప్రేమలు వాడుకుంది… బెత్లెహం మిస్సయ్యింది

తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ భాషా భేదం లేదు. కంటెంట్ బాగుంటే చాలు కన్నడ, తమిళ, మలయాళం, ఇంగ్లీష్ అనే తేడాలు పెట్టుకోరు. కలెక్షన్లు కురిపిస్తారు. కాకపోతే దాన్ని సరిగా వాడుకునే ప్లానింగ్, మార్కెటింగ్ తెలివి తేటలు ఉండాలి. గతంలో ప్రేమలు ఏపీ తెలంగాణలో ఎంత విజయం సాధించిందో తెలిసిందే. ప్రమోషన్లతో మొదలుపెట్టి డైలాగులు ఆదిత్య హాసన్ తో రాయించడం వరకు ప్రతి విషయంలో తీసుకున్న శ్రద్ధ కమర్షియల్ గా గొప్ప ఫలితాన్ని ఇచ్చి సూపర్ హిట్ ముద్ర వేయించుకుంది.

తాజాగా విడుదలైన బెత్లెహాం కుటుంబ యూనిట్ అలాంటి అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోతున్న వైనం కళ్ళముందు కనిపిస్తోంది. రెండు వారాలు ఆలస్యంగా విడుదల కావడం ఒక పొరపాటు అయితే దానికి సరైన పబ్లిసిటీ చేయకపోవడంతో అధిక శాతం జనాలకు చేరడం లేదు. తక్కువ షోలు ఉన్నా సరే హౌస్ ఫుల్స్ అవుతున్న వైనం బుక్ మై షోలో గమనించవచ్చు. స్ట్రెయిట్ మూవీ రంభ ఊర్వశి మేనక కన్నా వేగంగా బెత్లెహాం కుటుంబ యూనిట్ ఫుల్స్ కావడం గమనించాల్సిన విషయం.

తక్కువ ఓటిటి విండో వల్ల తెలుగు వెర్షన్ కు షోలు ఇచ్చేందుకు మల్టీప్లెక్సులు విముఖత చూపించడం మొదటి రోజు బుకింగ్స్ మీద ప్రభావం చూపించింది. తర్వాత సర్దుబాటు చేశారు కానీ షోలు సరిపోవడం లేదు. టైటిల్ మన నేటివిటీకి అనుగుణంగా లేకపోయినా బాగుందనే టాక్, సోషల్ మీడియా సపోర్ట్ చూసి మన ఆడియన్స్ థియేటర్స్ కు వెళ్లిపోతున్నారు. మీర్జాపూర్ తో పోటీగా హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో బెత్లెహాం కుటుంబ యూనిట్ బాగా పెర్ఫార్మ్ చేయడం విశేషం.

మేకర్స్ ఒకటి గుర్తించాలి. ఎంత డబ్బింగ్ సినిమా అయినా సరే ఒకవేళ దాన్ని తెలుగు జనాలకు అందించాలని అనుకుంటే మాత్రం వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ చేపట్టాలి. లేదా సమాంతరంగా ఒరిజినల్ వెర్షన్ తో పాటు రిలీజ్ చేయాలి. హిట్టు ఫట్టు ప్రతిసారి మన చేతుల్లో ఉండవు కాబట్టి పాజిటివ్ అనుకుని చేసుకుంటూ పోవడమే. ఒకవేళ కనీసం ఒక వారం ముందు ఇదే సినిమా వచ్చి తగిన పబ్లిసిటీకి కనక నోచుకుని ఉంటే ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది. టాక్సిక్ వల్ల ఛాన్స్ మిస్సయ్యింది.  

This post was last modified on September 6, 2026 7:17 pm

Share

Recent Posts

బాలయ్య దాదా… మాస్ జనాలు ఫిదా

గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్…

1 hour ago

అరుదైన జాబితాలో రవితేజ

వరుసగా ఆరు ఫ్లాపులు ఎదుర్కొన్న రవితేజకు.. ‘ఇరుముడి’ రూపంలో ఒక మోస్తరు విజయం దక్కినా చాలని చూశారు అభిమానులు. కానీ…

2 hours ago

మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం

ఇటీవ‌ల ఇద్ద‌రు ఫోక్ డ్యాన్స‌ర్ల‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త వివాదం సోష‌ల్ మీడియాలో, మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే…

2 hours ago

ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్… శిథిలాల కింద 50 మంది?

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ సమీపంలోని సత్య నికేతన్ ప్రాంతంలో 4 అంతస్తుల భవనం హఠాత్తుగా కుప్పుకూలిన ఘటన షాకింగ్…

3 hours ago

అనస్వరకు అంత డిమాండ్ ఉందా?

మలయాళం నుంచి కథానాయికలను తెలుగులోకి తీసుకురావడం కొత్త కాదు. నయనతార, మమత మోహన్ దాస్, కీర్తి సురేష్ లాంటి చాలామంది…

5 hours ago

‘రాకా’ లెవెలే వేరంటున్న నటుడు

పుష్ప, పుష్ప-2 సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమాల తర్వాత బన్నీ…

5 hours ago