గత ఏడాది డిసెంబర్ లో అఖండ 2 తాండవం తర్వాత బాలకృష్ణ నుంచి కొత్త సినిమా రాలేదు. ముందు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో అనుకున్న కథను వద్దనుకుని తర్వాత వేరే స్టోరీతో ఎన్బికె 111 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీకి ‘దాదా’ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని చిన్న టీజర్ రూపంలో రివీల్ చేస్తూ విడుదల తేదీ ప్రకటించారు. ముందే లీకైన సమాచారాన్ని ధృవీకరిస్తూ డిసెంబర్ 24 దాదా థియేటర్లలో పెద్ద ఎత్తున అడుగు పెట్టబోతున్నాడు.
అంటే సరిగ్గా ఏడాది తర్వాత బాలయ్య ఆగమనం జరగబోతోంది. వీడియోలో కంటెంట్ గురించి ఎక్కువ క్లూస్ ఇవ్వలేదు కానీ బాలయ్య క్యారెక్టరైజేషన్ ఏ స్థాయిలో ఉంటుందనే క్లారిటీ దర్శకుడు గోపీచంద్ మలినేని అందించారు. చాలా గ్యాప్ తర్వాత బాలకృష్ణ ఫుల్ లెన్త్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నారు. పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ మధ్య కూచుని అధికారికి వార్నింగ్ ఇచ్చే సీన్ లో పవర్ ఫుల్ మాస్ చూపించారు. డైలాగులు కూడా ఫ్యాన్స్ తో ఈలలు వేయించేలా ఉన్నాయి.
రిలీజ్ డేట్ చెప్పేశారు కాబట్టి అభిమానుల్లో ఉన్న అనుమానం తొలగిపోయింది. నాగార్జున కింగ్ 100, షారుఖ్ ఖాన్ కింగ్ తో క్లాష్ ఫిక్స్ అయిపోయింది. ముందు సంక్రాంతికి వస్తుందని ఫ్యాన్స్ భావించినా నిర్మాతలు క్రిస్మస్ వైపే మొగ్గు చూపారు. ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే వసూళ్ల పరంగా డిసెంబర్ చివరి వారం మంచి పొటెన్షియాలిటీ ఉన్నది. పాజిటివ్ టాక్ వస్తే కనీసం మూడు వారాలు బలమైన వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటవచ్చు.
వీరసింహారెడ్డి తర్వాత వస్తున్న కాంబో కావడంతో దాదా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. గతంలో బాలయ్య అశోక చక్రవర్తి, యువరత్న రాణా, సుల్తాన్ లాంటి సినిమాల్లో డాన్ గా నటించారు. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ పాత్రలో కనిపించడం స్పెషల్ గా నిలవనుంది. కొంత ఓజి షేడ్స్ కనిపిస్తున్నా బాలకృష్ణ, మ్యానరిజంస్, బాడీ లాంగ్వేజ్ ఊర మాస్ టచ్ తో ఉన్నాయి. పెద్ది తర్వాత వృద్ధి బ్యానర్ పై నిర్మాత వెంకట్ సతీష్ కిలారు నిర్మించిన భారీ చిత్రం దాదానే.
This post was last modified on September 6, 2026 7:10 pm
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…
నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…
ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…
రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…