Movie News

ఈవెంట్లకే రాని నయన్ థియేటర్ విజిట్ చేసిందా?

సౌత్ ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన అతి కొద్ది మంది కథానాయికల్లో నయనతార ఒకరు. ఒక వైపు పెద్ద హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది నయన్. ఏ సినిమా చేసినా.. దానికి పెద్ద బలంగా మారుతుంది ఈ మలయాళ కుట్టి. కాకపోతే తన సినిమాలను ప్రమోట్ చెయ్యదు అన్నది నిర్మాతల నుంచి ఆమెపై ఉన్న కంప్లైంట్.

కొందరు నిర్మాతలు ఈ విషయంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తాను సినిమా ఓకే చేసే ముందే ప్రమోషన్లకు రాలేను అని అగ్రిమెంట్లోనే స్పష్టంగా చెప్పేస్తా అన్నది నయన్ వాదన. ఐతే ఎప్పుడో ఒకసారి కొన్ని సినిమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చి ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటుంది నయన్. ఇటీవల ‘టాక్సిక్’ సినిమా కోసం అలాగే ఒక ఈవెంట్లో పాల్గొంటే అందరూ ఆశ్చర్యపోయారు.

ఐతే తాను నటించిన సినిమాలకు ప్రమోషనల్ ఈవెంట్లకే ఎప్పుడో కానీ రాని నయన్.. ఇప్పుడు ఒక చిత్రం కోసం థియేటర్ విజిట్ కూడా చేయడం చర్చనీయాంశం అయింది. తమిళంలో యంగ్ హీరో కవిన్‌తో కలిసి నయన్ ‘హాయ్’ అనే ఒక సినిమాలో నటించింది. పెద్ద వయసు అమ్మాయి.. తన కంటే చిన్నవాడైన కుర్రాడితో ప్రేమలో పడే కథతో తెరకెక్కిన చిత్రమిది. నయన్ నటించిన ‘టాక్సిక్’తో పాటే ఈ చిత్రం కూడా విడుదలైంది. ఐతే సినిమాకు పాజిటివ్ రివ్యూలేమీ రాలేదు.

తెలుగులో వాషౌట్ అయిపోయిన ‘హాయ్’ మూవీ తమిళంలో ఒక మాదిరిగా ఆడుతోంది. ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు నయన్.. థియేటర్ విజిట్ చేసింది. అక్కడ స్పందన మామూలుగా లేదు. సినిమా ఈవెంట్లకే రాని నయన్.. ఇలా థియేటర్‌కు వచ్చేసరికి అందరూ షాకైపోయారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం చర్చనీయాంశం అయింది.

కానీ అసలు విషయం ఏంటంటే.. ‘హాయ్’ చిత్ర నిర్మాతల్లో నయనతార కూడా ఒకరు. ఈ కథ నచ్చి స్వయంగా నిర్మించేందుకు ముందుకొచ్చింది నయన్. కాబట్టే ప్రమోషన్లలో ఒక స్టెప్ ముందుకు వేసి థియేటర్ విజిట్‌కు కూడా వెళ్లింది. కారణం ఏదైతేనేం.. నయన్‌ స్థాయి సూపర్ స్టార్ ఒక యంగ్ హీరోయిన్ తరహాలో థియేటర్ విజిట్‌కు వెళ్లడం మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

This post was last modified on September 4, 2026 3:11 pm

Share

Recent Posts

చిరుతో మేన‌ల్లుడి పోటీ ప‌క్కా అట‌

ఒక‌ప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్. కానీ రోడ్డు ప్ర‌మాదం త‌ర్వాత త‌న కెరీర్…

37 minutes ago

ఎదురుగాలిని తట్టుకుని నిలవడం గ్రేటే

ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…

1 hour ago

నాని vs మహేష్… అర్థరహిత వాదన

ది ప్యార‌డైజ్ సినిమా ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వ‌చ్చిన హైప్, దీనికి జ‌రిగిన అడ్వాన్స్…

1 hour ago

ఎమ్మెల్యేల రెండు పెళ్ళిళ్ళు… బాంబు పేల్చిన సీఎం

ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు…

2 hours ago

సింగిల్ సింహం సిపిఐతో వస్తుందా?

వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…

2 hours ago

చిరు ట్రోల్స్ అన్ని చూస్తున్నారా

మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజ‌రైనా త‌న‌దైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తెర మీదే…

3 hours ago