Movie News

రాకా గురించి సడెన్ డిస్కషన్లేంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త చిత్రం ‘రాకా’ను అభిమానులు కోరుకున్నట్లుగా ప్రమోట్ చేయట్లేదనే కంప్లైంట్ ఉంది. ఈ సినిమా మొదలై ఏడాది దాటిపోయింది. ఇప్పటిదాకా జస్ట్ టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఈ మూవీ అనౌన్స్ అయ్యాక బన్నీ రెండు పుట్టిన రోజులు జరుపుకోగా.. ఇంతకుమించి అప్‌డేట్స్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు.. టీజర్ ఎప్పుడొస్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.

బన్నీ ఏదో ఒక కారణంతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు కానీ.. ‘రాకా’ మాత్రం పెద్దగా చర్చల్లో ఉండట్లేదు. బన్నీ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఈ సినిమా గురించి చర్చించుకోని టైంలో.. సడెన్‌గా ‘రాకా’ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగిపోతున్నాయి. రాాకా రిలీజ్ డేట్ గురించే కాక ఈ సినిమాలో విశేషాల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

‘రాకా’ వచ్చే ఏడాది మధ్యలో రిలీజవుతుందనే అంచనాతో ప్రేక్షకులు ఉండగా.. 2027 డిసెంబరులోనే విడుదల అని ఒక ప్రచారం నడుస్తోంది. కానీ అదెంత వరకు నిజం అన్న దానిపై క్లారిటీ లేదు. మరీ అంత లేట్ అయితే బన్నీ ఫ్యాన్స్ గగ్గోలు పెడతారనడంలో సందేహం లేదు. మరోవైపు ‘రాకా’లో దీపికా పదుకొనే కథ ప్రకారమే ప్రెగ్నెంట్‌గా కనిపించనుందని.. ఆమె నిజంగానే కొన్ని నెలల ముందు గర్భం దాల్చడంతో దర్శకుడు అట్లీ సందర్భోచితంగా ఆమె మీద సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడని అంటున్నారు.

ఇక ఇందులో మరో కథానాయిక అయిన రష్మిక మందన్నా పాత్ర సినిమా మధ్యలో ఎంట్రీ ఇస్తుందని.. చివరికి ఆమె పాత్ర బాగా హైలైట్ అవుతుందని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు కూడా ఒక రూమర్ వినిపిస్తోంది. ఇలా ‘రాకా’ గురించి సడెన్‌గా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఐతే ఇవన్నీ బయటి వాళ్లు లీక్ చేసిన విషయాలా.. లేక సినిమాను వార్తల్లో నిలబెట్టడానికి టీమే లీక్స్ ఇచ్చిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ రూ.800 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తుండడం విశేషం.

This post was last modified on September 4, 2026 3:17 pm

Share

Recent Posts

చిరుతో మేన‌ల్లుడి పోటీ ప‌క్కా అట‌

ఒక‌ప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధ‌ర‌మ్ తేజ్. కానీ రోడ్డు ప్ర‌మాదం త‌ర్వాత త‌న కెరీర్…

2 hours ago

ఎదురుగాలిని తట్టుకుని నిలవడం గ్రేటే

ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…

2 hours ago

నాని vs మహేష్… అర్థరహిత వాదన

ది ప్యార‌డైజ్ సినిమా ఫైన‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వ‌చ్చిన హైప్, దీనికి జ‌రిగిన అడ్వాన్స్…

3 hours ago

ఎమ్మెల్యేల రెండు పెళ్ళిళ్ళు… బాంబు పేల్చిన సీఎం

ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు…

3 hours ago

సింగిల్ సింహం సిపిఐతో వస్తుందా?

వైసీపీ అధినేత జగన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతర పార్టీలతో ఎప్పుడూ పొత్తులు పెట్టుకోలేదు. ఎన్నికల్లో…

4 hours ago

చిరు ట్రోల్స్ అన్ని చూస్తున్నారా

మెగాస్టార్ చిరంజీవి ఏ ఈవెంట్‌కు హాజ‌రైనా త‌న‌దైన శైలిలో పంచులు వేస్తూ.. హుషారుగా మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. తెర మీదే…

4 hours ago