మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకా విడుదల తేదీ జనవరి 13 ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సెంటిమెంట్ రిపీట్ చేసేలా పక్కా ప్లానింగ్ తో షూటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. టీజర్ కు బాగానే రెస్పాన్స్ వచ్చింది. పండక్కు ఎంత పోటీ ఉన్నా మెగా మాస్ వర్కౌటవుతుందనే నమ్మకం అభిమానుల్లో వచ్చేసింది. అయితే తాజా లీకుల ప్రకారం రిలీజ్ డేట్ విషయంలో కాకా ట్విస్టులు ఇవ్వొచ్చట.
అంటే చెప్పిన డేట్ కి కాకా వచ్చే అవకాశాలు కొంత తగ్గాయని వాటి సారాంశం. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ అది సరిపోదనే అనుమానం యూనిట్ వర్గాల్లో ఉందట. పైగా రెండు కీలక పాత్రలకు సంబంధించిన ఆర్టిస్టుల సెలక్షన్ ఇంకా జరగలేదని వినికిడి. ఇమేజ్ ఉన్న వాళ్ళ కోసం గట్టిగా ట్రై చేస్తున్న బాబీ ఇంకో వారం పది రోజుల్లో వాళ్ళను ఫైనల్ చేయొచ్చని తెలిసింది. దానికి తోడు టాక్సిక్ ఇచ్చిన షాక్ వల్ల కెవిఎన్ ఆర్థిక వ్యవహారాలు కొంత కుదుపుకు లోనైనట్టు టాక్.
వీటిలో నిజమెంతో అబద్దమెంతో కానీ ఒకవేళ ఇలా జరిగే పక్షంలో మరో ఆప్షన్ గా విశ్వంభరని రెడీ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే విపరీతమైన వాయిదాలకు గురైన ఈ ప్యాన్ ఇండియా మూవీ అసలు ఏ స్టేజిలో ఉందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పదే పదే విఎఫ్ఎక్స్ అవ్వలేదనే కారణాలు చెబుతున్నారు తప్పించి అంతకు మించి ఒక్క అప్ డేట్ రాలేదు. మొన్న చిరు పుట్టినరోజుకు మొక్కుబడిగా ఒక పోస్టర్ వచ్చింది అంతే.
కాకాకు సంబంధించి పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొంత సమయం వేచి చూడాలి. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో చిరంజీవి రెండు షేడ్స్ లో కనిపించనున్నారు. అవి డ్యూయల్ రోలా లేక ఇంకేదైనా మలుపు ఉందానేది ప్రస్తుతానికి సస్పెన్స్. మాటలు రాని కూతురిగా అనస్వర రాజన్, మరో ముఖ్యమైన పాత్రలో నివేత పేతురాజ్ కనిపించనున్నారు. ప్రస్తుతానికి జనవరి 13 రిలీజ్ డేటులో మార్పు లేదు కానీ ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఇప్పుడైతే చెప్పలేం.
Gulte Telugu Telugu Political and Movie News Updates