ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్లుగా చలామణి అవుతున్న చాలామంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డవాళ్లే. ఇంటర్వ్యూల్లో వారిని కదిపితే.. ఒకప్పటి కష్టాల గురించి బయటపడుతుంటారు. మోహన్ బాబు లాంటి దిగ్గజ నటుడు.. కెరీర్ తొలి రోజుల్లో పడ్డ కష్టాల గురించి చెప్పింది వింటే కన్నీళ్లు రాక మానవు.
తమిళంలో స్టార్ కమెడియన్‌గా ఎదిగి, హీరోగా కూడా రాణిస్తున్న సూరి.. ఒకప్పుడు ఒక సినిమా యూనిట్లో తనకు జరిగిన ఘోర అవమానం గురించి ఇలా కన్నీళ్లు తెప్పించే మాటలే చెప్పాడు. ఒక సినిమా సెట్లో అతణ్ని చొక్కా లేకుండా నిలబెట్టారట. ఆ అవమానం గురించి సూరి గద్గద స్వరంతో మాట్లాడుతూ, దాదాపుగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఏం చెప్పాడంటే..
“నా కెరీర్ మొదట్లో నన్ను ఒక పెద్ద హీరో సినిమా షూటింగ్ కోసం పిలిచారు. అందులో ఒక టాప్ కమెడియన్‌తో కలిసి నటించే కాంబినేషన్ సీన్ అది. షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ పెద్ద హీరో, దర్శకుడు కలిసి మానిటర్‌లో సీన్ చూసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు నా చొక్కా విప్పేసి.. ఆ పాత్ర కోసం రికమండేషన్‌తో వచ్చిన వేరే వ్యక్తికి తొడగమని చెప్పారు.
అది ప్రొడక్షన్ చొక్కా కూడా కాదు. నా సొంత చొక్కా అయినప్పటికీ దాన్ని లాక్కున్నారు. షూట్ అయిన తర్వాత దాన్ని కాస్ట్యూమ్ వెహికల్ మీదికి విసిరేశారు. ఒంటిపై కేవలం ఒక టవల్ మాత్రమే కప్పుకుని తీవ్ర అవమాన భారంతో నా చొక్కా కోసం అక్కడ వెతుక్కున్నాను. నా సినీ ప్రయాణంలో నన్ను అత్యంత మానసిక వేదనకు గురిచేసిన, ఎప్పటికీ మర్చిపోలేని ఘటన” అది అని సూరి చెప్పాడు.
మొదట చిన్న చిన్న పాత్రలే చేసిన సూరికి భీమిలి కబడ్డీ జట్టు ఒరిజినల్లో చేసిన కామెడీ రోల్ మంచి పేరు తెచ్చి పెట్టింది. అందులో పరోటాలు తినే సీన్ వల్ల ఫేమ్ రావడంతో పరోటా సూరిగా పేరు తెచ్చుకున్నాడు. ఆపై పలు కామెడీ పాత్రలతో స్టార్ కమెడియన్ అయ్యాడు. విడుదల, మామన్ లాంటి చిత్రాలు అతడికి హీరోగా కూడా గొప్ప పేరు సంపాదించి పెట్టాయి. ఇప్పుడు తెలుగు నటుడు సుహాస్ తో కలిసి చేసిన మండాడి వచ్చే వారం మంచి అంచనాల మధ్య విడుదలవుతోంది.
This post was last modified on September 3, 2026 7:43 pm
వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…
సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…
https://twitter.com/GulteOfficial/status/2103820050603864546
తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు వ్యవహారంలో 40 కోట్ల రూపాయలు కీలకంగా…
వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…