Movie News

ప్యార‌డైజ్ క్రేజుకి ఇది నిద‌ర్శ‌నం

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్, అత్య‌ధిక వ‌ర్కింగ్ డేస్‌లో రూపొందుతున్న చిత్రం.. ది ప్యార‌డైజ్. దీనికి క్రేజ్ కూడా అదే స్థాయిలోనే ఉంది. సినిమా అనుకున్న దాని కంటే బాగా ఆల‌స్యం అయినా.. క్రేజ్ ఏమీ త‌గ్గ‌లేదు. ది ప్యార‌డైజ్ నుంచి ఏ ప్రోమో వ‌చ్చినా.. అది హైప్ పెర‌గ‌డానికే ఉప‌యోగ‌ప‌డుతోంది. గ‌త నెల‌లో టీజ‌ర్ లాంచ్ అయిన‌పుడు సోష‌ల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ వ‌చ్చినా.. వ్యూస్ మాత్రం మోతెక్కిపోయాయి. ఇటీవ‌లే రిలీజైన యేష‌నాగుల క‌ట్ట పాట విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. పాట‌లో ఊపు త‌గ్గంద‌ని.. ముఖ్యంగా డ్యాన్స్ అంత బాగా లేద‌ని.. ఇలా ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపించాయి సాంగ్ రిలీజైన‌పుడు.

కానీ యేష‌నాగుల క‌ట్ట యూట్యూబ్‌లో దుమ్ముదులిపేస్తోంది. కేవ‌లం ఐదు రోజుల వ్య‌వ‌ధిలో ఈ సాంగ్‌కు 50 మిలియ‌న్ వ్యూస్ రావ‌డం విశేషం. తెలుగులో ఇంత త‌క్కువ వ్య‌వ‌ధిలో ఈ మార్కును అందుకున్న పాట ఇదేన‌ట‌. తెలుగు నుంచి ఎన్నో పాన్ ఇండియా సినిమ‌లు రాగా.. వాటిలోంచి ఏ పాటా సాధించ‌లేని ఘ‌న‌త‌ను ప్యార‌డైజ్ సాంగ్ అందుకుంది.

దీన్ని బ‌ట్టే ఈ సినిమాకు జ‌నాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. నాని, శ్రీకాంత్ ఓదెల తొలి క‌ల‌యిక‌లో రూపొందిన ద‌స‌రా 100 కోట్ల వ‌సూళ్ల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గా.. ఈ కాంబినేష‌న్లో రెండో ది ప్యార‌డైజ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచే హైప్ మామూలుగా లేదు.

దీని బ‌డ్జెట్ రూ.200 కోట్లు దాటిపోయిన‌ట్లు స‌మాచారం. అయినా సినిమాను బ‌య్య‌ర్లు ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి తీసుకునే అవ‌కాశ‌ముంది కాబ‌ట్టి నిర్మాత సేఫ్ అయిపోతాడ‌ని భావిస్తున్నారు. సినిమా అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉంటే పాన్ ఇండియా స్థాయిలో ఇది పెద్ద సెన్సేష‌న్ అవ‌డం ఖాయం.

నాని రేంజ్ కూడా మారిపోతుంది. ఈ చిత్రంలో లెజెండ‌రీ న‌టుడు మోహ‌న్ బాబు విల‌న్ పాత్ర చేయ‌గా.. కాయదు లోహ‌ర్ నానికి జోడీగా న‌టించింది. ద‌స‌రా ప్రొడ్యూస‌ర్ సుధాక‌ర్ చెరుకూరినే నిర్మించిన ది ప్యార‌డైజ్ సెప్టెంబ‌రు 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 3, 2026 9:29 pm

Share

Recent Posts

నాని న‌న్ను భ‌రించాల్సిందే… వేరే దారి లేదు – ఓదెల‌

శ్రీకాంత్ ఓదెల‌.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రికీ హీరో నాని గుర్తుకొస్తాడు. ఈ సుకుమార్ శిష్యుడి మీద నానికి ఎంత…

45 minutes ago

నానిని వీళ్లు పట్టుకున్నారు… వాళ్లు వదిలేశారు

నేచురల్ స్టార్ నానికి కొన్నేళ్ల ముందు వరకు బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజే ఉండేది. అతను సాధారణ కుర్రాడి పాత్రలే…

1 hour ago

ప్యారడైజ్ మీటింగులో పదనిసలు

నాని కెరీర్ లో మొదటిసారిగా తన సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా డిస్కషన్ జరగడం అందరినీ ఆశ్చర్య…

3 hours ago

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

4 hours ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

5 hours ago