కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన యాభై సినిమాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి కావొస్తోంది. ఆవేశం ఫేమ్ జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ కాంబో మీద బిజినెస్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ కు పూర్తి విభిన్నమైన జానర్ లో రూపొందిన ఈ కాప్ డ్రామా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. తర్వాత జై భీం ఇచ్చిన టిజె జ్ఞానవేల్ డైరెక్షన్లో డాక్టర్ గా కనిపించబోతున్నాడు. ఇక్కడి దాకా నెంబర్ 48.
జన నాయకుడు ఫేమ్ హెచ్ వినోత్ సూర్య 49 డైరెక్టర్ గా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు. ఇక నెక్స్ట్ యాభై మైలురాయి వచ్చేస్తుంది. చెన్నై వర్గాల కథనం ప్రకారం అది ‘రోలెక్స్’ కానుందని సమాచారం. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ మన అల్లు అర్జున్ 23 పనుల్లో బిజీగా ఉన్నాడు. షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. రిలీజయ్యేనాటికి రెండేళ్ల సమయం పడుతుంది. అంటే 2028 చివర్లో లేదా అటుపై ఏడాది విడుదలని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. ఆలోగా సూర్య ఫ్రీ అయిపోవచ్చు.
కాకపోతే ఈ కాంబినేషన్ రకరకాల క్యాలికులేషన్ల మీద ఆధారపడి ఉంటుంది. సూర్య ఈ సక్సెస్ స్ట్రీక్ ని ఇలాగే కొనసాగించాలి. ఒకవేళ బన్నీ 23 కనక బ్లాక్ బస్టర్ అయితే లోకేష్ కనగరాజ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సహజంగానే తన నెక్స్ట్ మూవీ మీద అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అందులోనూ రోలెక్స్ క్యారెక్టర్ అంటే జనం ఊగిపోతారు. ఆ ఒత్తిడిని తట్టుకునే స్క్రిప్ట్ సిద్ధమై అంత బడ్జెట్ సూర్య మీద పెట్టే నిర్మాత దొరికితేనే కార్యరూపం దాలుస్తుంది.
ఇది కాకుండా లోకేష్ కనగరాజ్ కమిట్ మెంట్స్ వేరే కూడా ఉన్నాయి. తన లిస్టులో ఖైదీ 2, విక్రమ్ 2 నిజంగా తెరకెక్కుతాయా లేక ఊరికే వార్తల దగ్గర ఆగిపోతాయాని మూవీ లవర్స్ ఖంగారు పడుతున్నారు. తన కెరీర్ మొత్తం మీద పది సినిమాలు మించి తీయనని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన లోకేష్ నిజంగా దానికి కట్టుబడే పనైతే ఇక్కడ చెప్పిన సీక్వెల్స్ అన్ని రావు. మరి తన మనసులో ఏముందో, ఎలాంటి కాంబినేషన్లు వస్తాయో అర్థం కావాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
This post was last modified on September 3, 2026 6:27 pm
రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని…
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. కానీ తర్వాత నాలుగు నెలల పాటు బాక్సాఫీస్‌లో హాహాకారాలు తప్పలేదు. నిఖార్సయిన…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' సెప్టెంబర్ 11 విడుదల…
ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో సహ మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఫోకస్ పడుతూనే ఉంది. హీరో…
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి విదితమే. తారక్…
మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ…