ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో సహ మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఫోకస్ పడుతూనే ఉంది. హీరో హీరోయిన్ ఇద్దరూ కొత్తవారే అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్లు వైరల్ అయ్యాయి. అమ్మాయనే సంగతి మర్చిపోయి ఒకరు గుండు కొట్టించుకునే సవాల్ విసరగా, మరొకరు ఏకంగా యాభై కోట్ల గ్రాస్ చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. మాములుగా అయితే ఇవి చాలా పెద్ద మాటలు. కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా మరీ ఇలాంటి శపధాలు చేయకూడదు.
సరే అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే ముందు రోజు ప్రీమియర్లతోనే సౌండ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆశ్చర్యకరంగా హైదరాబాద్ లో వేస్తున్న షోలు వేగంగానే ఫుల్ అయ్యే దిశగా వెళ్లడం గమనించాల్సిన విషయం. ఎక్స్, ఇన్స్ టా తదితర మాధ్యమాల్లో కూడా హీరోయిన్ గుండు టాపిక్ గురించి మాట్లాడుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సినిమా నిరాశపరిస్తే జుత్తు త్యాగం చేస్తానని చెప్పిన మాట ప్రభావం ఎంత ఉంటుందో ఇవాళ అర్ధరాత్రి తేలనుంది.
ఒకటి ఒప్పుకోవాలి. ఇలాంటి వైరల్ స్టేట్ మెంట్ల వల్లే చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ వస్తున్నాయి. టాక్ బాగుంటే పికప్ అవుతుంది లేదా ఆ రోజు సాయంత్రమే ప్యాకప్ అవుతుంది. అది వేరే విషయం. అయితే సోషల్ మీడియాలో కనీస స్థాయిలో సౌండ్ రావాలంటే ఏదో ఒకటి హైలైట్ అయ్యే పని చేయాలి లేదా మాట్లాడాలి. సహ టీమ్ రెండోది ఎంచుకుంది. ప్రస్తుతానికి రేపు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా పరిమిత షోలే ఉన్నా వీకెండ్ కాంతా పెరుగుతాయనే ధీమా టీమ్ లో ఉంది.
కాంపిటీషన్ అయితే టఫ్ గానే ఉంది. మొత్తం ఆరు కొత్త రిలీజులు ఉన్నాయి. ఇరుముడి ఇంకా కొనసాగుతోంది. టాక్సిక్ కిందా మీద పడుతూ రెండో వారంలోకి అడుగు పెట్టింది. టాలీవుడ్, బాలీవుడ్, డబ్బింగులు కలిపి ఒకేసారి మూకుమ్మడి దాడి చేస్తున్న టైంలో సహ తన ఉనికిని చాటుకోవాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. మరి ఈ సవాళ్లు కేవలం నీటి మూటగా మిగులుతాయా లేక బేబీ లాగా జనాలను రప్పించే కాసుల మూటగా మిగులుతాయా వేచి చూడాలి.
This post was last modified on September 3, 2026 5:29 pm
ఒక సినిమాకు ఒక యాక్టర్‌ను ఎంపిక చేశాక.. మళ్లీ మార్పులు జరగడం సినీ పరిశ్రమలో మామూలే. కాల్ షీట్లు సర్దుబాటు…
చిరంజీవి కాకా స్పీడ్ మాములుగా లేదు. నిన్న జరిగిన సిగ్మా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ స్వయంగా కొన్ని…
ఒకప్పుడు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుండేవాడు మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్. కానీ రోడ్డు ప్రమాదం తర్వాత తన కెరీర్…
ది ప్యారడైజ్ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చిన స్పందన, ట్రోలింగ్ గురించి నాని రెండో రోజే ఓపెన్ అయిపోవడం అందరినీ…
ది ప్యారడైజ్ సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో కానీ.. ఈ సినిమాకు వచ్చిన హైప్, దీనికి జరిగిన అడ్వాన్స్…
ఎమ్మెల్యేలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తేనెతెట్టును కదిపారు. దాంతో ఇప్పుడు కర్ణాటకలో రెండు పెళ్లిళ్లు…