రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11 విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ మూవీకి 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించగా హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. అనిరుధ్ రవిచందర్ యుకె టూర్ కోసం అమెరికా వెళ్లిన నిర్మాత నాగవంశీ తిరిగి రాగానే ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు. ఇక్కడ మన టాపిక్ ఆనంద్ దేవరకొండ గురించి.
2023 బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ అసలే సినిమాలు చేయలేదు. దానికన్నా ముందు కమిటైన గంగం గణేశా రిలీజయ్యింది కానీ జనం పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీని బేబీ జంటతో తీయాలని సాయి రాజేష్ ఫస్ట్ లుక్ టెస్ట్ చేసి పోస్టర్లు వదిలాక ఆగిపోయింది. తర్వాత సీన్ లోకి కిరణ్ అబ్బవరం, గౌరీశ్రీ ప్రియ వచ్చారు. ఎపిక్ కూడా ముందు అనుకున్నది నితిన్ తో. తర్వాత అటుఇటు ఊగి ఆనంద్ దగ్గరకి చేరింది. అందుకే ఇంత ఎక్కువ టైం పట్టింది.
ఇదంతా ఆనంద్ దేవరకొండ మూడు సంవత్సరాల కాలాన్ని ఖర్చు చేసింది. ఆ బాకీ మొత్తం ఎపిక్ తీర్చాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమాలో మంచి రొమాన్స్, మ్యూజిక్ తో పాటు బరువైన ఫాదర్ ఎమోషన్స్ గట్రా ఉన్నాయట. హద్దులు దాటించకుండా ఆనంద్, వైష్ణవి మధ్య పెట్టిన లవ్ ట్రాక్, ఇంటిమసీ సీన్లు, కెమిస్ట్రీ చాలా కొత్తగా ఉంటాయట. ఇవి కనక కనెక్ట్ అయితే ఖచ్చితంగా హిట్ అనే నమ్మకంతో టీమ్ ఉంది. దానికి తగ్గట్టే ప్రమోషన్ల వేగం పెంచుతోంది.
వచ్చే వారం ఎపిక్ కు కాంపిటీషన్ ఉన్నప్పటికీ సితార నెట్ వర్క్ వల్ల థియేటర్లకు లోటు ఉండదు. కాకపోతే టాక్ చాలా కీలకం కానుంది. హీరో హీరోయిన్ ఇద్దరూ ఆల్రెడీ కాలేజీలు తిరుగుతూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అటు వైష్ణవి చైతన్యకు కూడా ఈ సక్సెస్ ముఖ్యం. బేబీ తర్వాత చేసిన లవ్ మీ ఇఫ్ యు డేర్, జాక్ దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. మ్యూజిక్ డైరెక్టర్ హేశం వహాబ్ సైతం రేసులో వెనుకబడ్డాడు. అందరికీ బ్రేక్ ఇవ్వాల్సిన బాధ్యత ఆదిత్య హాసన్ మీద ఉంది.
This post was last modified on September 3, 2026 5:25 pm
ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో సహ మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఫోకస్ పడుతూనే ఉంది. హీరో…
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి విదితమే. తారక్…
మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి సీఎం…
2019లో పాకిస్థాన్‌తో జరిగిన వైమానిక పోరుతో అభినందన్ వర్ధమాన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఇప్పుడు అతను కొత్త కెరీర్ మొదలుపెట్టారు.…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.…